Tuesday, May 7, 2024

ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ?

- Advertisement -
- Advertisement -

మా ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్ అని, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాదిరిగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆరోపించారు.

తమ పార్టీ నాయకులపైనే దాడులు చేయించిన ఘనత కాంగ్రెస్‌దని, తెలుగువారి గౌరవం పివి నరసింహారావుపైనే చెప్పులు విసిరిన ఘనత ఆ పార్టీ నాయకులదేనని ఆయన తెలిపారు. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలని, ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని, తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా? తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News