Tuesday, September 10, 2024

పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు తప్పదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు తప్పదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బిఆర్‌ఎస్ న్యాయపోరాటం చేస్తుందని, రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారని కెటిఆర్ వివరించారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందన్న రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారన్నారు.  త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేస్తామని, తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎంఎల్‌ఎలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఢిల్లీలోని ప్రముఖ న్యాయ కోవిదులతో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు కెటిఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. బిఆర్ఎస్ లో గెలిచిన తొమ్మిది మంది ఎంఎల్ఎలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News