Friday, May 3, 2024

ఎన్నిక ఏకపక్షమే.. హ్యాట్రిక్ సిఎం లాంఛనమే

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి : మొన్న ఓటుకు నోటు, నేడు కాంగ్రెస్ పార్టీలో సీటుకో రేటు నడుస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్, ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అంటలేరు రేటేంత సారు అంటుండ్రు అని ఎద్దేవా చేశారు. అలాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఉంచుతాడా మొత్తం అమ్మెస్తాడా? అని ప్రశ్నించారు. ఎలక్షన్స్ అనగానే ఆగం కావొద్దు ఆలోచన చేయాలని అన్నారు. ఆయన సోమవారం ప్రత్యేక హ్యెలిక్యాప్టర్‌లో భూపాలపల్లికి చేరుకోగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కరుణాకర్ , స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి స్వాగతం పలికారు. ముందుగా రూ. 59.45 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల సముదాయ భవనాన్ని, జిల్లా పోలీస్ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల ను ప్రారంభించి, లబ్ధిదారులకు నివాస హక్కు పత్రాలను అందజేశారు.

అలాగే సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ అనంతరం సుభాష్‌కాలనీ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భూపాలపల్లిలో ఫలితం ఖరారు అయింది, మళ్లీ గులాబీ జెండా ఎగరబోతుందన్నారు. జూన్ 2,2014 నాడు భూపాలపల్లి పరిస్థితి ఏలా ఉంది, ఇప్పడు ఏలా ఉంది, నాడు రైతుల పరిస్థితి ఏంది, ఇప్పడు ఏలా ఉంది, అప్పడు సంక్షేమం ఏలా ఉండే, ఇప్పడు ఏలా ఉందో గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలన్నారు. లెక్కకు మించి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ రూ.200 ఇస్తే నేడు సిఎం కెసిఆర్ నాయకత్వంలో రూ.2000కి పెంచింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నాడు 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వస్తే… నేడు 46 లక్షలమందికి పెంచింది వాస్తవం కాదా అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వికలాంగులకు రూ.4000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.

గతంలో నేను రాను సర్కార్ దవాఖానకు అనే పాట పాడుకునే పరిస్థతికి నేడు జిల్లాకొక మెడికల్ కాలేజ్ తీసుకోని వచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. 100 మంది సూపర్ స్పెషాలటీ డాక్టర్లు అందుబాటులో ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. 40 శాతం నుండి 70శాతం వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి కాన్పులు పెరిగాయి అని గుర్తు చేశారు. అలాగే వారికి కెసిఆర్ కిట్‌తో పాటు, ఆడపిల్ల పుడుతే రూ.13,000, మగబిడ్డ పుడుతే రూ.12,000 ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే తలసరి ఆదాయంలో తెలంగాణ నెం.1 స్థానంలో ఉన్నది అని స్పష్టం చేశారు. జయశంకర్ జిల్లా పేరుతో ఏర్పాటు అయిన జిల్లా కలెక్టరెట్‌ను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నదని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సిఎం కె సిఆర్ చావు నోట్లో తల పెట్టి 11 రోజులు ఆమరణదీక్ష చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ విధిలేక తెలంగాణను ఇచ్చే విధంగా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ అంటుంది, 11 చాన్స్‌లు ఇచ్చిన 55 ఏండ్లల్లో దేశంలో, రాష్ట్రంలో రైతు బంధు, దళిత బంధు, కళ్యాణలక్ష్మివంటి పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితె మన వేలుతొ మన కంటిని పొడుచుకున్నట్లు అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే సీఎం కేసీఆర్ అవుతారు, అదే కాంగ్రెస్, బిజెపి పార్టీలలో సిఎం ఎవరు అవుతారు అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తో పోటీపడె నాయకులు ఇతర రాజకీయ పార్టీలు ఎవరూ లేరన్నారు. సోనియమ్మను బలిదేవత, రాహుల్ గాంధీని ముద్దు పప్పు అన్న రేవంత్ రెడ్డి ఇప్పడు సుద్దపప్పు అని నాలుకను ఎటు పడితే అటు తిప్పే వాళ్లను నమ్ముతారా అని ప్రశ్నించారు. అలాగే బానిసకు బానిస కాంగ్రెస్ పార్టీ అయిందని ఎద్దెవా చేశారు. ఇప్పడు ఢిల్లీతో పాటు కొత్తగా బెంగుళూరులో హైకమాండ్ తయారైందన్నారు.ఢిల్లీ పెద్దలను కలవాలంటే వయా బెంగుళూరు నుండి పోవల్సిందేనని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న ప్రేమ, రాహుల్ గాంధీకి, నరేంద్రమెడీ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

ఆ గట్టున 70 ఏండ్లు రాబాందుల్లా పీక్కతిన్న కాంగ్రెస్ పార్టీ ఉంది ,ఈ గట్టున 73వేల కోట్లు ఇచ్చిన రైతు బంధు ఉందన్నారు.- ఆ గట్టన 60 ఏండ్లు కన్నీళ్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఈ గట్టన నీళ్లు ఇచ్చి కారు పార్టీ ఉందన్నారు. ఈ గట్టునా కారు ఉంటే ఆ గట్టునా బేకారు గాళ్లందరు ఉన్నారని విమర్శించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ వస్తే వార్త, నేడు కరెంట్ పోతె వార్త అని అన్నారు. కళ్లముందే అభివృద్ధ్ది, గుండె నిండా సంక్షేమం ఉన్నదని అన్నారు. కాంగ్రెస్, బిజెపి చెప్పే మాటలు విని మోసపోకూడదు, ఆగం కావద్దు అన్నారు. సిఎం కెసిఆర్ అన్ని విషయాలు అందరికి ఉపయోగపడే విధంగా చెప్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారీ, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, పెద్దపెల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News