Tuesday, April 30, 2024

మురుగు శుద్ధికి సూచనలు

- Advertisement -
- Advertisement -

 

హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యం నుంచి కాపాడాలి : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని నెక్లస్‌రోడ్డులోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పరిశీలించారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి మేయర్ రామ్మోహన్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. మురుగునీటిని శుద్ధి చేయడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలకు చెడు వాసనుల నుంచి దూరం చేసినట్లు అవుతుందన్నారు. మురుగునీటిని శుద్ధి చేసిన తరువాత ఆ నీరు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుందన్నారు. ఫలితంగా హుస్సేన్‌సాగర్ నుంచి కాలుష్యం నుంచి కాపాడేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రంలో శుద్ధమైన మురికినీటి నమూనాలను పరిశీలించిన మంత్రి కెటిఆర్, పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో పాటు హెచ్‌ఎండిఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News