Sunday, August 10, 2025

ఆదిలాబాద్ ఐటీ టవర్ పురోగతిపై కెటిఆర్ హర్షం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ ఐటీ టవర్ పురోగతిపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించి.. నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఐటీ టవర్ల జాబితాలో చేరిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు ఆదిలాబాద్‌కు మంజూరైన ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. రెండుమూడు నెలల్లో భవనం పూర్తయ్యేలా పనులు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News