Tuesday, May 14, 2024

మాజీ మేయర్‌పై మంత్రి కెటిఆర్ ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

మాజీ మేయర్‌పై మంత్రి కెటిఆర్ ప్రశంసలు..
హైదరాబాద్ అభివృద్ధికి అద్భుతమైన కృషి అని ట్వీట్..

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం బొంతు రామ్మోహన్ అద్భుతమైన కృషి చేశారని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. బుధవారంతో మేయర్‌గా తన పదవీకాలం ముగియడంతో బొంతు రామ్మోహన్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్‌ఎంసికి తొలి మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం తన అదృష్టంగా భావిస్తున్నానని రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్‌లకు హృద యపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తన శక్తిమేర కృషి చేశానని పేర్కొన్నారు. ఈ అందమైన జర్నీలో మరిచిపోలేని జ్ఞాపకాలు ఎన్నో అని రామ్మోహన్ తెలిపారు. ఇవన్నీ తన జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తనపై ప్రేమ చూపించిన ప్రతీ హైదరాబాదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బొంతు రామ్మోహన్ ట్వీట్ చేశారు. బొంతు ట్వీట్‌ను ట్యాగ్ చేసిన మంత్రి కెటిఆర్ ప్రశంసలతో రీట్వీట్ చేశారు.

KTR Praises on Ex Mayor Bonthu Rammohan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News