Thursday, May 2, 2024

ఐటిని ఆదుకోండి

- Advertisement -
- Advertisement -

టి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టి, ఆదాయపు పన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలి
ఐటి పార్కులు, సెజ్‌లకు ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్‌ని ప్రవేశపెట్టాలి
ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులు నిర్దేశించాలి
ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ప్రత్యక్ష ప్రయోజనాలను పొందుటకు గడువును వచ్చే ఏడాది వరకు పొడగించాలి
కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాసిన కెటిఆర్
ఐటి రంగాన్ని ఆదుకునేందుకు పలు సలహాలు, సూచనలు చేసిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలోని సూక్ష్మ,మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉన్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ఐటి శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటి, దాని అనుబంధ పరిశ్రమను ఆదుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు సంబంధించి సవివరమైన లేఖ రాస్తానని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా గురువారం కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వివిధ అంశాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వంతో పరిశ్రమ పరిస్థితులపైన జరుగుతున్న సంభాషణలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వాములు చేయడం పట్ల ముందుగా కెటిఆర్ హర్షం వ్యక్తం చేస్తూనే… ఐటి, ఐటిలోని ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలకు సంబంధించి ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు లక్షల మంది ఐటి ఉద్యోగులు ఉన్నారన్నారు. ప్రస్తుత సంక్షోభ ప్రభావం వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నదన్నారు. అయితే ఈ ప్రభావం చిన్న కంపెనీలపైన అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐటి, జిఎస్‌టి పన్నుల రిఫండ్లను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. రూ. 25 లక్షల కన్నా తక్కువగా ఉన్న ఆదాయపు పన్ను బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన సూచించారు. 25 లక్షలకు పైగా బకాయిలు ఉన్న నేపథ్యంలో వాటిలో కనీసం 50 శాతం అయిన వెంటనే విడుదల చేయాలని కోరారు.
జిఎస్‌టికి సంబంధించి కేంద్రం ప్రకటించిన మినహాయింపుల విషయంలో తొలినాళ్లలో కొంత అయోమయం నెలకొన్న నేపథ్యంలో అనేక కంపనీలు పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించాయన్నారు. అయితే ఆయా సంస్థలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రావాల్సిన రీఫండ్లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి కంపెనీలకు సహాయకారిగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ ఐటి విభాగంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వివిధ శాఖలతో సమన్వయానికి అవకాశం కల్పించాలని మంత్రి కెటిఆర్ కోరారు. సూక్ష్మ, మధ్య మధ్యతరహా సంస్థలకు కనీసం 50 శాతం రుణ సదుపాయాన్ని పెంచాలని, తద్వారా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందన్నారు. దీంతో కరోనా సంక్షోభం వలన లే ఆఫ్స్ (lay offs) కలుగకుండా ఉంటాయని మంత్రి తెలియజేశారు. దీనిపైన సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఉండాలని కోరారు. ఇలాంటి రుణాలను తిరిగి వసూలు చేసేందుకు కనీసం 12 నెలల కాలాన్ని నిర్దేశించాలన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సంబంధించిన ప్రత్యక్ష ప్రయోజనాలను పొందుటకు మార్చి31, 2020 తుది గడువుగా కేంద్రం ప్రకటించిందని, దీనిని కనీసం వచ్చే ఏడాది వరకు పొడగించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అనేక కంపెనీల్లోని ఉద్యోగుల సాంద్రత ఆఫీస్ కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందని, దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులులా నిర్దేశించాలన్నారు. అన్ని ఐటి పార్కులు, సెజ్ ల్లోని కార్యాలయాలకు ఈమేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా సురక్షిత కార్యక్షేత్రాలు( work places) ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీంతోపాటు ఐటి పార్కులు, సెజ్ ల్లోని కార్యాలయాలకు, ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్ ని ప్రవేశపెట్టాలన్నారు. అలాగే అగ్నిమాపక మార్గదర్శకాల మాదిరే వీటిని కూడా తప్పనిసరి చేయాలని తన లేఖలో సూచించారు.

పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష

పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ …19 సంక్షోభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఎదుర్కోంటున్న సంక్షోభం తర్వతా యధావిధిగా రాష్ట్రంలోని పారిశ్రామిక రంగ కార్యకలాపాలు కోనసాగేలా అవసరం అయిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఈసందర్భంగా మంత్రి ఆదేశించారు. కోవిడ్ సంక్షోభం క్రమంగా తొలగిపోతుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి, భవిష్యత్తులో పరిశ్రమల్లోని పని స్ధితిగతులు మాత్రం మారతాయన్నారు. ప్రస్తుతం వైరస్ కట్టడికోసం చేపట్టిన సామాజిక దూరం, వ్యక్తిగత హైజీన్( సబ్బులు, సానిటైజర్ల వినియోగం) కొనసాగుతుందన్నారు. దీంతోపాటు పని ప్రదేశాల్లో కొన్ని మార్పులు చేసుకుని పనిచేయాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి మరింత నమ్మకం కలిగించేలా పరిశ్రమలు వివిధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్ధితుల వలన కొన్ని ఇబ్బందులున్నప్పటికీ, వ్యాపార వాణిజ్యాలు పూర్వస్ధాయిలో జరిగేలా ఇప్పటి నుంచే అయా వర్గాలతో సంభాషించాలని పరిశ్రమలు, ఐటి శాఖాధికారులను ఆయన ఆదేశించారు.
గురువారం బేగంపేటలోని టి ఫైబర్ కార్యాలయంలో ఐటి, పరిశ్రమల శాఖాలో పనిచేస్తున్న వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ పెట్టుబడులును నూతన ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న మంత్రి కెటియార్, వీటిని అందుకునేందుకు తెలంగాణ సిద్దంగా ఉండాలన్నారు. ఈదిశగా పరిశ్రమల శాఖ పని చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కంపెనీలతోపాటు నూతన పెట్టుబడి అవకాశాలున్న రంగాల్లో మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ఇందుకోసం పరిశ్రమల శాఖతోపాటు ఇతరశాఖాలతో సమన్వయం చేసుకూంటూ ముందుకు పోవాలన్నారు. దీంతోపాటు ప్రస్తుత సంక్షోభం వలన ఏఏ రంగాల్లో ఏలాంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయో అధ్యయనం చేసి, వాటి సహాయాకారిగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన విభాగాల వారీగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పాల్గోన్నారు.

KTR Review Meeting with IT High Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News