Saturday, May 4, 2024

రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టులో నిలబెడతా: లలిత్ మోడీ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఐపిఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ గురువారం వరుస ట్వీట్లతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల కారణంగా తాను దేశం విడిచి పారిపోయినట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను తీవ్రంగా ఖండించిన లలిత్ మోడీ బ్రిటన్ కోర్టులో రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు. మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయించుకున్న రాహుల్ గాంధీ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని లలిత్ మోడీ విమర్శించారు.
ప్రతిపక్ష నాయకులకు వాస్తవాలు పూర్తిగా తెలియకపోవడం వల్లనో లేక రాజకీయ కక్షసాధింపుతోనో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లలిత్ మోడీ తన వరుస ట్వీట్లలో వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కోర్టులో దోషిగా నిలబెడతానంటూ ఆయన సవాలు విసిరారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్త, దారినపోయే దానయ్యలు అందరూ తాను పరారీలో ఉన్న నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారని, అసలు భారతదేశంలో ఏ కోర్టు తనను దోషిగా నిర్ధారించిందని లలిత్ మోడీ ప్రశ్నించారు. నిజానికి పప్పు అలియాస్ రాహుల్ గాంధీయే పదవికి అనర్హుడిగా మారి సామాన్య పౌరుడిగా మిగిలిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా గాంధీ కుటుంబానికి సన్నిహితులైన కాంగ్రెస్ నాయకుల అవినీతి గురించి కూడా లలిత్ మోడీ ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News