Tuesday, May 7, 2024

లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిలు మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Laloo

న్యూఢిల్లీ: దాణా కుంభకోణానికి సంబంధించిన రూ.139.35 కోట్ల డోరాండా ట్రెజరీ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది, ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అతని న్యాయవాది కథనం ప్రకారం, న్యాయస్థానం ఆ ప్రముఖ నాయకుడి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంది. “అతను త్వరలో విడుదల అవుతాడు. అతను లక్ష రూపాయల పూచీకత్తు, 10 లక్షల రూపాయలను జరిమానాగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది”అని అతని లాయర్ చెప్పారు. డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్ల అక్రమ విత్‌డ్రాకు సంబంధించిన ఐదవ దాణా కుంభకోణం కేసులో 73 ఏళ్ల నాయకుడిని రాంచీలోని సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News