Sunday, April 28, 2024

గ్రామ పంచాయతీకి భూ విరాళం

- Advertisement -
- Advertisement -
Land donation to Valmidi Gram Panchayat
300 గజాల భూమిని గ్రామానికి రాసి ఇచ్చిన దాతలు
పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్
మంత్రి చేతుల మీదుగా సర్పంచ్‌కు అందజేత
హైదరాబాద్‌లో స్థిరపడిన పాలకుర్తి మండలం వల్మీడి గ్రామ మాశెట్టి సోదరుల ఔదార్యం
దాతలను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మనతెలంగాణ, హైదరాబాద్ : పుట్టిన ఊరు, కన్నతల్లి రుణం తీర్చుకోవాలని భావించిన ముగ్గురు సోదరులు, తమ సొంతూరుకు ఏదైనా చేయాలని భావించారు. వెంటనే దానిని ఆచరణలోకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే 300 గజాల భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…. మా శెట్టి ఉపేందర్, కృష్ణ, వెంకటేష్‌లు అన్నదమ్ముళ్లు. వల్మిడి గ్రామం మా శెట్టి సోమయ్య -కనక మహాలక్ష్మిల కొడుకులు. వీరంతా వ్యాపరం నిమిత్తం హైదరాబాద్‌లో స్థిర పడ్డారు.

వీరంతా హైదరాబాద్‌లో ఉంటున్న కారణంగా గ్రామంలోని ఇల్లు శిథిలావస్థకు చేరింది. దీంతో వాళ్లంతా తమ తల్లితండ్రులు సోమయ్య, కనకమహాలక్ష్మిల జ్ఞాపకార్థం ఆ ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఆలోచన వచ్చిందే తడవుగా, గ్రామ సర్పంచ్ కత్తి సైదులును సంప్రదించారు. సోమవారం కొడకండ్లకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ కాగితాలను మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి అందచేశారు. అప్పటికప్పుడే వల్మీడి సర్పంచ్ కత్తి సైదులును మంత్రి పిలిపించగా, మంత్రి సమక్షంలో సంబంధిత రిజిస్ట్రేషన్ పేపర్లను వారు సర్పంచ్‌కు అందచేశారు.

భూ విరాళం గ్రామ ప్రజలు మరచి పోలేరు

సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ వల్మీడి గ్రామ పంచాయతీలో కార్యాలయ నిర్మాణానికి 300 గజాల స్థలాన్ని వితరణ చేసిన మా శెట్టి సోదరులను అభినందించారు. సొంతూరుకు ఎంతో కొంత చేయాలన్న వారి తపన ఆదర్శనీయమన్నారు. వారి తల్లితండ్రుల స్మార కార్థం చేసిన భూ విరాళం గ్రామ ప్రజలు మరచి పోలేరన్నారు. మా శెట్టి సోదరులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామాల్లో మరింత మంది దాతలు ముందుకు రావాలన్నారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా సమయంలో ఉదారతని చాటుకుంటూ, వేలాది మందిని అదుకున్నారని, దాని ముందు తాము చేసిన వితరణ గొప్పదేమి కాదని ఆ ముగ్గురు అన్నదమ్ములు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News