Tuesday, May 21, 2024

చైనాను విడిచిపెట్టనున్న ఏకైక భారతీయ జర్నలిస్టు

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలో ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్‌గా ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్ట్ ఈ నెలాఖరులోగా చైనాను విడిచిపెట్టి భారత్‌కు రానున్నారు. ఆయన వీసాను చైనా రెన్యువల్ చేసేందుకు నిరాకరించింది. 2020 నుంచి భారత్‌లో ఉన్న చైనా జర్నలిస్టుల వీసాలను భారత్ నిరాకరించిందని, అందుకే చైనా లోని భారతీయ జర్నలిస్టుల వీసా పొడిగించడానికి అంగీకరించడం లేదని చైనా చెబుతోంది. ఇప్పుడున్న చివరి జర్నలిస్ట్ వీసా పూర్తయిన తరువాత ఈనెలాఖరు లోగా చైనా విడిచి రానున్నారు.

2023 ప్రారంభంలో భారతీయ జర్నలిస్టులు నలుగురు చైనాలో పనిచేస్తుండే వారు. వీరిలో ఇద్దరు వీసాలు స్తంభింప చేయడంతో తిరిగి వచ్చేశారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు తమ వీసా గడువు తీరిపోవడంతో జూన్ 11న తిరిగి భారత్‌కు వచ్చేశారు. చివరి భారతీయ జర్నలిస్ట్ ఈనెలాఖరుకు భారత్‌కు తిరిగి వచ్చేస్తారు. దీంతో చైనాలో భారతీయ జర్నలిస్టులు ఎవరూ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News