Saturday, May 4, 2024

కాంగ్రెస్‌ను భూస్థాపితం చేద్దాం

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ను అందించి మూడు పంటలు పండించాలన్న సంకల్పమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకల్వల రైతు వేదిక భవనంలో గురువారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన రైతన్న – మేలుకో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు మూడు పంటలు పండించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన చేసి నిరంతరం నీరుతో పాటు 24 గంటలు విద్యుత్‌ను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే అధికారంలోకి రాకముందే రైతన్నలపై ఉన్న కపట ప్రేమను కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట పెట్టారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, ఎఎంసీ చైర్మన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత – రమేష్, పీఎసీఎస్ చైర్మన్లు మోహన్‌రావు, జూపల్లి సందీప్‌రావు, యూత్ మండలాధ్యక్షుడు గుడుగుల సతీష్, కన్వీనర్లు దీకొండ భూమేష్, తాళ్లపల్లి మనోజ్‌గౌడ్, సర్పంచ్‌లు ఎరుకొండ రమేష్, సాగర్‌రావు, మూల స్వరూప (హరీష్), కోమల – సారయ్య, ఎంపీటీసీలు సంపత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News