Sunday, May 5, 2024

మక్కాకు మళ్లీ పరిమిత సంఖ్యలో యాత్రికులు

- Advertisement -
- Advertisement -

Limited number of pilgrims back to Mecca

 

రియాద్ : కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా అమలవుతున్న ఆంక్షలను సౌదీ అరేబియా ప్రభుత్వం సడలించడంతో పరిమిత సంఖ్యలో యాత్రికులు మక్కాకు వస్తున్నారు. ఈమేరకు ఆదివారం తెల్లనివస్త్రం కప్పే సంప్రదాయం పాటించడానికి చాలా తక్కువ సంఖ్యలో యాత్రికులు మక్కాను సందర్శించారు. ప్రపంచం లో అనేక దేశాల నుంచి ఏడాది పొడుగునా ఉమ్రా యాత్ర కోసం లక్షలాది యాత్రికులు రాకుండా రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ దేశాలన్నీ ఆంక్షలు సడలించడం ప్రారంభించడంతో సౌదీ ప్రభుత్వం ఆదివారం నుంచి గరిష్టంగా రోజుకు 6000 మంది యాత్రికులను అనుమతించింది. ఈ మొదటి దశ యాత్ర ప్రారంభంలో సౌదీ పౌరులు, నివాసీయులు, మాత్రమే మక్కాలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. ప్రతివ్యక్తి మూడు గంటలు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనవలసి ఉంటుంది. రోజూ అనేక సార్లు మసీదు స్టెరిలైజ్ చేయడంతోపాటు పరిశుభ్రం చేయాల్సి ఉంటుంది. అలాగే చతురస్రాకార కాబా గృహాలను కూడా ముస్లిం పరిశీలకులు రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది. సందర్శకులు ప్రార్ధనల కోసం ఉమ్రా నిర్వహణ కోసం మక్కా మసీదులో ప్రవేశించాలంటే ఆన్‌లైన్‌లో ముందుగా దరఖాస్తు చేయవలసి వస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News