Monday, April 29, 2024

మొదటిసారి పోలీస్ ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశం

- Advertisement -
- Advertisement -

Virtual meeting of Police superiors for first time

 

ప్రధాని మోడీ, అమిత్‌షా పాల్గొనే అవకాశం

న్యూఢిల్లీ : దేశం లోని పోలీస్ చరిత్రలో మొట్టమొదటి సారి ఉన్నతాధికారుల వార్షిక వర్చువల్ సమావేశం వచ్చేనెల నవంబర్ ఆఖరి వారంలో కరోనా నేపథ్యంలో జరుగుతుందని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన డిజిపి, ఐజిపి అధికారులు పాల్గొనే ఈ రెండు రోజుల వర్చువల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా పాల్గొంటారు.

కరోనా మహమ్మారి సమయంలోను, సైబర్ టెర్రరిజం వంటి కొత్తతరం నేరాల నివారణ లోను, యువత హేతువాదం, జమ్ముకశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం లోను పోలీసులు వహించిన కీలక పాత్రపై ఈ సమావేశంలో చర్చిస్తారని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పోలీసులు సాహసంతో నిర్వహించిన విధులపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సామర్ధాన్ని, వారి విజ్ఞానాన్ని, ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య సంక్షోభాలు ఎదురైనప్పుడు ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా విపరీతాలను నివారించాలన్న కోణంలో సమావేశంలో చర్చిస్తారు. ఈ అనుభవాలను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు గ్రహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News