Monday, May 6, 2024

బైటికొస్తే ప్రూఫ్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

dgp

 

ఇయ్యాల్టి నుంచి లాక్‌డౌన్ ఇంకా కఠినం

పాస్‌లపై పునఃసమీక్ష జరుపుతాం
వివిధ రంగాల ఉద్యోగులకు ప్రత్యేక రంగుల్లో పాసుల జారీకి ప్రతిపాదిస్తున్నాం
ఇప్పటికే 1.20లక్షల వాహనాలు సీజ్
జిహెచ్‌ఎంసిలోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలి
ఇంటి అద్దెలపై 36 ఫిర్యాదులొచ్చాయి
మీడియాతో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి
అదనపు వేతనంపై సిఎంకు కృతజ్ఞతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు అమలులో ఉండే లాక్ డౌన్ ను వివిధ శాఖల సమన్వయంతో మరింత పకడ్బందీగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. డిజిపి కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లాక్‌డౌన్ అమలుపై తీసుకుంటున్న నిర్ణయాలను డిజిపి వివరించారు. ఈ సందర్భం గా డిజిపి మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన కరోనా వ్యాధి నివారణకై రా ష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

తమ ఇంటి నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంవరకే నిత్యావసర వసువులకై రావాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరు తమ నివాస గుర్తింపు కార్డును తమ వద్ద తప్పక ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఆస్పత్రులకు వెళ్లేవారు అందుకు సంబంధించిన ప్రూఫ్‌లు, రెసిడెన్స్ ప్రూఫ్ లు వెంట ఉంచుకోవాలని, సాధారణ జబ్బులకు స్థానిక ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన లక్షా ఇరవై వేలకు పైగా వాహనాలను ఇప్పటికే సీజ్ చేశామని, లాక్‌డౌన్ పూర్తయ్యాక ఆయా వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని, కోర్టు ద్వారానే వాహనాలను వాటి యజమానులు తీసుకోవాలని డిజిపి తెలియజేశారు.సమావేశంలో అడిషనల్ డిజిపి జితేందర్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, ఐజి స్టీఫన్ రవీంద్రలు పాల్గొన్నారు.

పాస్‌లపై పునః సమీక్ష
నిత్యావసర సరుకుల రవాణా, ఐటి, ఫార్మా తదితర రంగాలకు చెందిన పలు ఉద్యోగులకు దాదాపు పదిహేను వేలకు పైగా పాసులు జారీ చేశామని, ఈ పాసుల జారీ ని పునః సమీక్షించనున్నట్టు తెలిపారు. . ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు విధులకు హాజరయ్యే వారికి ఆరోజుకు సంబందించిన ప్రత్యేక రంగుతో కూడిన పాస్ లను జారీ చేయాలని వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను కోరనున్నట్టు తెలిపారు. సోమవారం నాడు ఎరుపు, మంగళవారం గ్రీన్, బుధవారం పసుపు, గురువారం తెలుపు, శుక్రవారం లేత గులాబీ, శనివారం నీలి రంగు పాసులను జారీ చేయాలని ప్రతిదిస్తున్నామని చెప్పారు. ప్రతీ పాస్ పై ఉద్యోగి నివాసం చిరునామా, కార్యాలయ వివరాలు తప్పక ఉండాలని తెలిపారు.

కంటైన్మెంట్‌లో కఠిన నిర్ణయాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 329 కంటైన్మెంట్ జోన్ లలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వానికి- అధికారులకు ప్రజలందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. మర్కజ్ కు వెళ్లివచ్చిన వారందరినీ పోలీస్ శాఖ గుర్తించిందని వెల్లడించారు. నగరంలో ఎవరైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే తప్పని సరిగా జిహెచ్‌ఎంసి అనుమతితో వారి ద్వారానే చేయాలని, ఫుడ్ డిస్టిబ్యూషన్ చేసే సమయంలో సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు.. లాక్ డౌన్ అమలులో పోలీసులకు కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోషియేషన్ లు సహకరించాలని, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలోఒకే ఎంట్రీ-ఎక్జిట్ ఉండేలా చూసుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.

ఇంటి అద్దెలపై 36 ఫిర్యాదులు
రాష్ట్రంలో ఇంటి అద్దెలను అడగవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి, చట్టం చేసినా తమను ఇంటి అద్దె అడుగుతున్నారని డయల్ 100 కు సోమవారం నాడు 36 ఫిర్యాదులు అందాయని, ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులపై ఆయా ఇంటి యజమానులను చైతన్య పర్చామని డిజిపి వెల్లడించారు. సామాజిక దూరం పాటించడంలేదనే ఫిరాదులు ఎక్కువగా డయల్ 100 కు వస్తున్నాయని పేర్కొన్నారు.

సిఎంకు పోలీసుల కృతజ్ఞతలు
కరోనా నివారణకై పోలీస్ శాఖ చేస్తున్న కృషిని గుర్తించి పది శాతంఅదనపు వేతనాన్ని అందించాలని ముఖ్యమం త్రి కెసిఆర్ ప్రకటించడం పట్ల పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈక్రమంలో కరోనా వైరస్ నియం త్రణకు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని డిజిపి పిలుపునిచ్చారు.

 

Lockdown from today tough
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News