Sunday, May 5, 2024

కాంగ్రెస్ నేత విహెచ్‌పై పోలీసు కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

 Congress leader VH

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై మంగళవారం సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆయనపై 188, 269 సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ట్యాంక్ బండ్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలెవ్వరూ ట్యాంక్ బండ్‌కు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అయితే, డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విహెచ్ ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

Lockdown: Police Case Filed against Congress leader VH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News