Wednesday, May 1, 2024

లారీల దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

lorrys thiefs was arrested in hyderabad

పరారీలో మరో ఇద్దరు దొంగలు
మూడు లారీలను చోరీ చేసిన నిందితులు
పట్టుకున్న కాలపత్తర్ పోలీసులు

హైదరాబాద్: లారీలు చోరీ చేస్తున్న వ్యక్తిని కలాపత్తర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 20లక్షల విలువైన లారీ ఎపి 22వై 5369ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్ర కారం…. నగరంలోని ఫలక్‌నూమా, నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన సాబీర్ ఖాన్, సలీం అలియాస్ లూల, యాస్‌రూన్ కలిసి లారీలను దొంగతనం చేస్తున్నారు.

వ్యసనాలకు బానిసగా మారిన సాబీర్ మద్యం, గంజాయి సేవిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి లారీలు నిలిపే ప్రాంతాల్లో తిరిగే వారు, అర్ధరాత్రి తర్వాత లారీలను దొంగతనం చేస్తున్నారు. డూప్లికేట్ కీతో లారీని స్టార్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. లారీని చోరీ చేసిన తర్వాత స్క్రాప్‌లాగా చేసి విక్రయిస్తున్నాడు. దీనిని నిందితుడు స్నేహితులు సలీం, యాస్‌రూన్ సహకరిస్తున్నారు. వీరు ఇద్దరు పరారీలో ఉన్నారు.

కేసు నమోదు చేసుకున్న కాలపత్తర్ పోలీసులు దర్యాప్తు చేశారు. సౌత్‌జోన్ డిసిపి ఇద్దరు ఇన్స్‌స్పెక్టర్లు, ఆరుగురు కానిస్టేబుళ్లతో టీంను ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు దొంగతనం చేసిన లారీని రాజస్థాన్‌లో విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు దానిని పట్టుకున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో లారీని పట్టుకుని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇన్స్‌స్పెక్టర్ విక్రం సింగ్, కానిస్టేబుళ్లు బాలాదస్తగిరి, ఎండి సైఫ్ మోహియుద్దిన్, నవీన్‌కుమార్, వెంకటేశ్వర్లు, జగదీశ్వర్, సతీష్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, డిసిపి గజారావు భూపాల్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News