Wednesday, May 1, 2024

రైతు ఉద్యమం @100

- Advertisement -
- Advertisement -

Farmers' protest enters 100th day

వంద రోజులైనా వెనక్కి తగ్గని అన్నదాతలు, బ్లాక్ డేలో భాగంగా ఢిల్లీ సమీపంలోని జాతీయ రహదారి దిగ్బంధం, సాగు చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం సాగిస్తాం, రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టా లను రద్దు చేయాలని, తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని 100 రోజుల క్రితం అన్నదాతలు నిరసనకు దిగారు. తమకు ప్రచారం లేకపోయినా.. ఎం డాకాలం సమీపిస్తున్నా తాము అనుకున్నది సాధించే దాకా వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు తేల్చి చెబుతు న్నాయి. అందుకు తగ్గట్టే ఉద్యమం మొదలై వంద లు పూర్తయిన సందర్భంగా తమ నిరసనను తెలుపుతూ రైతులు శనివారం‘ బ్లాక్‌డే’ను పాటిస్తున్నారు. తమ ఆం దోళనలో భాగంగా కుండ్లి మనేసార్‌పల్వాల్ ఎక్స్‌ప్రె స్ వేను ఉదయం 11గంటల సాయంత్రం నాలు గు గంటల అయిదు గంటల దిగ్బంధించా రు. 136 కిలోమీటరల ఎక్స్‌ప్రెస్ వే పొడవునా రైతులు తమ సంఘాల జెండాలు ధరించి పాదయాత్ర చేపట్టారు. కొంతమంది రైతులు ట్రాక్టర్లపై వచ్చారు. వారంతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధంతో పాటుగా హైవేల సమీపంలోని టోల్‌ప్లాజాలను నిర్బంధించాలని, ప్రభుత్వ కార్యాలయా లు, ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేయాలని కూడా రై తులు పిలుపునిచ్చారు.

హైవేల పక్కనే శిబిరాలు

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న ఢిల్లీలో ప్రదర్శన కోసం పంజాబ్, హర్యానా, యుపి తదితర రాష్ట్రాలనుంచి తరలివచ్చిన వేలాది మంది రైతులు నగరంలోకి అనుమతించకపోవడంతో సింఘు, టిక్రి, ఘాజిపూర్‌ల వద్ద హైవేల పక్కన శిబిరాలు నిర్మిం చుకొని ధర్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. కేం ద్రంతో పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ .. రైతులు చట్టాల రద్దుకే పట్టుబడుతూ ఉండడంతో అవి కొలిక్కి రాకుండా పోయాయి. దేశ రాజధానిలో జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడం తో కేంద్రం సీరియస్ అయింది. అప్పటినుంచి ఉద్యమం కాస్త మందగించింది. శిబిరాల్లో జనం తగ్గారు. అయిన ప్పటికీ వారి ఉక్కు సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. ఏదేమైనప్పటికీ ఆ చట్టాలను రద్దు చేసేంతవరకూ వెనుది రిగి వెళ్లేది లేదని, ఎన్నాళ్లయినా ఈ ఉద్యమాన్ని కొన సాగిస్తామని రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సం యుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేశ్ తికాయత్ శ నివారం స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.

మేకులు నాటి అడ్డగిస్తారా? : రాహుల్

ఓవైపు దేశ సరిహద్దుల్లో వారి కుమారులు తమ జీవి తాలను పణంగా పెడుతుంటే, మరోవైపు తమ హక్కుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న అన్నదాత లను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేకులు నాటు తోందని అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించా రు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ఆందోళన శుక్రవారంతో 100వ రో జుకు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మద్దతుగా ట్విట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News