Friday, May 3, 2024

ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Love couple commit suicide in Mahaboobnagar

మన తెలంగాణ/మక్తల్ : పెద్దలు ప్రేమకు అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల పరిధిలోని ఉంద్యాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్తల్ నియోజకవర్గం నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్(23) అదే గ్రామానికి చెందిన బోయ అనూష(16) ఇద్దరూ ప్రేమించుకున్నారు. బాలిక మైనర్ కావటం, కులాలు కూడా వేర్వేరు అనే కారణంతో పెద్దలు ప్రేమకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెంది ఇద్దరూ చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల పరిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News