Sunday, April 28, 2024

నోడల్ ఆఫీసర్లకు సర్టిఫికేట్లు అందజేసిన రాచకొండ సిపి మహేష్ భగవత్

- Advertisement -
- Advertisement -

Mahesh Bhagwat presented certificate to nodal officers

 

మనతెలంగాణ, హైదరాబాద్ : కేసుల దర్యాప్తులో కీలక సమాచారం ఇచ్చి సహకరిస్తున్న నోడల్ ఆఫీసర్లకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సర్టిఫికేట్ అందజేశారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారికి అవార్డులు అందజేశారు. ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్, జియో, స్విగ్గీ, అమెజాన్, రాజోర్ పే, ఎన్‌పిసిఐ, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల ప్రతినిధులకు సర్టిఫికేట్ అందజేశారు. కేసుల దర్యాప్తు సమయంలో నోడల్ ఆఫీసర్లు సరైన సమయంలో కీలక సమాచారం ఇచ్చి నిందితులను పట్టుకునేందుకు సహకరించారని సిపి మహేష్‌భగవ్ తెలిపారు. సంచలనాత్మక సైబర్ క్రైం కేసుల్లో నోడల్ అధికారులు అత్యంత ముఖ్యమైన సమాచారం అందించారని అన్నారు. రానున్న రోజుల్లో సహకారం ఇలాగే కొనసాగించాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News