Friday, May 3, 2024

ఆమెకు ధైర్యం లేదు.. కానీ వేరే మార్గం లేదు

- Advertisement -
- Advertisement -

Major teaser release on April 12th

 

అడవి శేష్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘మేజర్’. 26/11 ముంబయ్ తీవ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయా మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సయా మంజ్రేకర్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో శోభిత ‘ప్రమోద’ అనే ఎన్నారై అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్టు తెలిసింది. “ఆమెకు ధైర్యం లేదు.. కానీ వేరే మార్గం లేదు” అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో శోభిత ఓ పాపను ఎత్తుకొని భయపడుతూ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 12న మేజర్ టీజర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, – మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ‘మేజర్’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో జులై 2న విడుదల చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News