Tuesday, May 7, 2024

మోడీ మణిపూర్ సిఎంను తొలగించాలి : ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ హింస పట్ల ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్రం గురించి మోడీ వాస్తవానికి పట్టించుకున్నట్టయితే మొదట చేయాల్సింది ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను పదవి నుంచి తొలగించడమేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్విటర్ ద్వారా సూచించారు. మణిపూర్ హింసను నివారించడంలోని వైఫల్యాలను బీజేపీ, మోడీ ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా కప్పిపుచ్చలేరని వ్యాఖ్యానించారు. మణిపూర్ పరిస్థితిపై కేంద్ర మంత్రి అమిత్‌షా మోడీతో చర్చించినట్టు వార్తలు వస్తున్నాయని, గత 55 రోజులుగా మోడీ మణిపూర్ గురించి ఏం మాట్లాడడం లేదని, మోడీ మాట్లాడాలని ప్రతి భారతీయుడు చూస్తున్నారని పేర్కొన్నారు.

మైతేయి, కుకి తెగల మధ్య హింస చెలరేగి వంద మంది కన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఉగ్రవాద వర్గాలు, సంఘవ్యతిరేక శక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రభుత్వం జప్తు చేయాలని డిమాండ్ చేశారు.అఖిల పక్షాలతో చర్చించి ఉమ్మడి రాజకీయ పరిష్కార మార్గాన్ని కనుగొనాలని సూచించారు. భద్రతా దళాల సాయంతో ప్రతిష్ఠంభనను తొలగించి జాతీయ రహదారులకు భద్రత కల్పించి, రవాణా సౌకర్యాలను ప్రారంభించాలని, నిత్యావసరాలను అందుబాటు లోకి తేవాలని సూచించారు. బాధితులకు సహాయం, పునరావాసం వెంటనే సిద్ధం చేయాలని, ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News