Friday, May 3, 2024

నగరంలో నకిలీ వస్తువులు.. బ్రాండెడ్ పేరుతో విక్రయం

- Advertisement -
- Advertisement -

,సిటిబ్యూరోః నకిలీ వస్తువులను బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న వ్యక్తిని, వాటిని తయారు చేస్తున్న ముగ్గురు నిందితుడిని,మరో బాలుడిని కాచిగూడ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈస్ట్‌జోన్ డిసిపి గిరిధర్, టాస్క్‌ఫోర్స్ డిసిపి రష్మి పెరుమాల్ సిసిఎస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహేంద్రసింగ్ బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కాచిగూడలో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. స్టోర్‌లో నకిలీ పారాచూట్ కొబ్బరినూనె, నకిలీ సర్ఫ్ ఎక్సెల్ డిటర్జంట్ ఫౌడర్, హర్పీక్, లైజాల్, రెడ్‌లేబుల్, బ్రూక్‌బాండ్, ఎవరెస్ట్ మసాలా తదితరాలను విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో కాచిగూడ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

నిందితుడిని పట్టుకోగా తయారు చేస్తున్న ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. కీసర మండలం, నాగారం, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లిలో నకిలీ వస్తువులు తయారు చేస్తున్నట్లు తెలిసింది. వాటిపై దాడి చేసి బీహార్ రాష్ట్రానికి చెందిన మితిలేష్ కుమార్, త్రియాం కుమార్‌ను అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన శ్యాం భాటియా, బేగంబజార్‌కు చెందిన జాయరాం, కమల్ భాటి పరారీలో ఉన్నారు. తయారీ కేంద్రాలపై దాడి చేసిన పోలీసులు దాదాపు రూ.2 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశారు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నిందితులు నకిలీ వస్తువులను నగరంలోని వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మార్కెట్ ధర కంటే తక్కువకే వీటిని డిస్ట్రిబ్యూటర్లకు విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు.

ప్రజలు సమాచారం ఇవ్వాలి..
నకిలీ నిత్యావసర వస్తువులను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కొందరు వ్యాపారులు, దుకాణాదారులు నకిలీ వస్తువులని తెలిసినా కస్టమర్లకు విక్రయిస్తున్నారని చెప్పారు. వినియోగదారులు నకిలీ వస్తువులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News