Monday, May 20, 2024

చదివింది ఎంబిఎ చేసేది చోరీలు

- Advertisement -
- Advertisement -
Man arrested for chain snatching in Hyderabad
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

ముషీరాబాద్: ఎంబిఎ చదివి ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి జల్సాల కోసం చైన్ స్నాచింగ్‌కు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడిని శనివారం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి చల్లా శ్రీధర్, సిఐ శివ శంకర్, అదనపు సిఐ ప్రభాకర్‌లు నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు. జగిత్యాలకు చెందిన గుళ్లపల్లి రామకృష్ణ ( 37 ) ఎంబిఎ చదివాడు. ముసీరాబాద్ పోస్ట్ ఆఫీస్ పక్కన నివసిస్తూ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడి ఉన్న జా బ్‌ను వదిలేసి అక్రమంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడ్డాడు. చై న్ స్నాచింగ్‌లు చేయాలన్న ఆలోచనతో తన హోండా యాక్టీవా పై చీకటిగా ఉన్న ప్రా ంతంలో వృద్ధులు నడుచుకుంటూ వెళ్తుంటే వారి మెడలో నుంచి చైన్లు కొట్టేయాలని ప్లాన్ వేసాడు.

ఇదిలా ఉండగా ఈ నెల 7వ తేదీన రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ప్రాంతంలో అశోక్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 1లో నివసించే సుష్మా పురాణి ( 65 ) అనే వృ ద్ధురాలు తన మనుమరాలుతో కలిసి అదే వీధిలో పండ్లు కొనుగోలు చేయడానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మాటు వేసి ఉన్న రామకృష్ణ ఆమె మెడలో ని 3 తులాల గొలుసును తెంపుకుని రెప్పపాటు కాలంలో మాయమయ్యాడు. బాధితు ల ఫిర్యాదు మేరకు డిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన సిబ్బంది సిసి పు టేజీ ఆధారంగా నిందితుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 30 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనంతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇంత తొందరగా నిందితుడ్ని ప ట్టుకుని సొత్తును రికవరీ చేసిన డిఐ ప్రభాకర్, సిబ్బందిని ఏసిపి అభినందించి బహుమతిని అందచేసారు.

Man arrested for chain snatching in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News