Monday, May 6, 2024

నాథూరామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శించిన వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మార్చి 30న శ్రీరామ నవమి శోభా యాత్రలో మహాత్మాగాంధీని చంపిన హంతకుడు నాథురామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శించిన వ్యక్తిని షాహినాయత్‌గంజ్ పోలీసులు అరెస్టుచేశారు. అతడిని గచిబౌలిలోని సిద్ధిఖ్‌నగర్‌కు చెందిన చింత హేమ కుమార్(21)గా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం హేమ కుమార్ నాడు నాథురామ్ ఫోటోను ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో అతడు ప్రదర్శించిన నాథురామ్ గాడ్సే చిత్రపటం వైరల్ అయింది. పోలీసులు ఐపిసి 504 కింద అతడిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో శ్రీరామ నవమి ర్యాలీ సందర్భంగా గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ రాజా సింగ్ ర్యాలీలో మంగళ్‌హాట్ గుండా ప్రధాన ర్యాలీలో వచ్చి కలిసింది. అప్పుడే గాడ్సే ఫోటో దర్శనమిచ్చింది. రాజా సింగ్ ర్యాలీలో జనం కలిసిన తర్వాతే ఈ ఫోటో ప్రదర్శన చోటుచేసుకుంది.

హిందుత్వ శక్తులు తమ బలమేమిటో నిరూపించుకోడానికి శ్రీరామ నవమి శోభ యాత్రను ఆలంబనంగా చేసుకున్నాయి. రాజా సింగ్ ప్రతి ఏడాది ఏదో ఒక రెచ్చగొట్టే పనిచేసి బుక్కవుతుంటారు. 2022లో ముస్లింలు రాముని నామాన్ని పలుకకపోతే దేశం నుంచి తన్ని తగలేస్తాం అన్నారు. ఈ ఏడాది కూడా వివాదం చోటుచేసుకుంది. ‘జైల్ కా తాలా తూట్ గయా, బాప్ తమ్హారా చూట్ గయా’ అనే 5.10 నిమిషాల తాజా పాటను ఈసారి సంధించారు. ఇప్పటికే ప్రవక్త ముహమ్మద్(స)కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పిడి యాక్ట్ కింద అరెస్టయి బెయిల్‌పై బయటికి వచ్చారు. ఆయన కామిక్ మునవర్ ఫారూఖీ షోకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి ర్యాలీ తర్వాత వివిధ కేసుల కింద రాజా సింగ్‌ను పోలీసులు బుక్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News