Sunday, May 5, 2024

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ 12వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అనిత బుధవారం తీర్పు చెప్పింది. లంగర్‌హౌస్ పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని లంగర్ హౌస్‌కు చెందిన చాన్ కరణ్ సింగ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి పక్కన ఉంటున బాలికపై కన్నేసిన నిందితుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేశాడు. తల్లి ఇంటికి వచ్చిన తర్వాత బాలిక విషయం చెప్పడంతో అత్యాచారం బయటికి వచ్చింది.

వెంటనే లంగర్‌హౌస్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఎఎస్ నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తర్వాత బాలికను వైద్య పరీక్షల కోసం భరోసా కేంద్రానికి తరిలించారు. నిందితుడిపై 376(3), 376(2),506 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. దాదాపుగా 20మంది సాక్షులను విచారించిన పోలీసులు కోర్టులో సాక్షాలను ప్రవేశ పెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి అనిత నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను సౌత్ వెస్ట్ జోన్ డిసిపి కిరణ్ ఖేర్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News