Sunday, September 21, 2025

స్నేహితుడి ఇంటికే కన్నం.. ఆడవేషంలో వచ్చి చోరీ చేసిన నిందితుడు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 6.75 తులాల బంగారం, రూ. 85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్‌కు వెళ్లాడు. ఊరికి వెళ్తున్న విషయాన్ని తన స్నేహితుడు హర్షిత్‌కు చెప్పాడు. హర్షిత్ అప్పులు చేయడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇదే మంచి సమయమని భావించిన నిందితుడు ఆడవేషం వేసుకుని శివరాజ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆడవేషంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు.

అనంతరం ఇంట్లో ఉన్న 6.75 తులాల బంగారం, రూ.1.10 లక్షల నగదు తీసుకుని పారిపోయాడు. ఊరి నుంచి వచ్చిన శివరాజ్ ఇంటికి వచ్చినప్పుడు బంగారం, నగదు లేకపోవడంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో వివరాలు సేకరించారు. హర్షిత్ ఆడవేషంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా హర్షిత్ చోరీకి పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చారు. అరెస్టు చేసి అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News