Sunday, April 28, 2024

”సుప్రీం” ఎదుట ఆత్మాహుతి యత్నం ఘటనలో ఇద్దరు వారణాసి పోలీసుల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

Man- woman attempts self-immolation outside SC

వారణాసి: బిఎస్‌పికి చెందిన ఎంపి అతుల్ రాయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన ఒక మహిళ తన సహచరుడితో కలసి సుప్రీంకోర్టు ఎదుట ఇటీవల ఆత్మాహుతి యత్నానికి పాల్పడిన ఘటనపై ఇద్దరు వారణాసి పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారణాసి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాకేష్ సింగ్‌తోపాటు అత్యాచార బాధితురాలిపై నమోదైన ఫోర్జరీ కేసును దర్యాప్తు చేస్తున్న మరో పోలీసు అధికారి గిరిజా శంకర్ సస్పెండ్ అయినట్లు పోలీసు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ఒక మహిళ ఘోసికి చెందిని బిఎస్‌పి ఎంపి అతుల్ రాయ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2019లో వారణాసిలోని లంక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో ప్రస్తుతం రాయ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఈ కేసులో తన వయసుకు సంబంధించి తప్పుడు ఆధారాలను సమర్పించారన్న ఆరోపణలతో నమోదు చేసిన ఫోర్జరీ కేసులో స్థానిక కోర్టు బాధితురాలికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడంతో ఆమె, మరో వ్యక్తితో కలసి సుప్రీంకోర్టు ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. 24 ఏళ్ల ఆమెకు 85 శాతం కాలిన గాయాలు కాగా 27 ఏళ్ల మరో వ్యక్తికి 65 శాతం గాయలయ్యాయి. వీరిద్దరూ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News