Sunday, April 28, 2024

పిసిసి చీఫ్ ఎంపికపై అధిష్టానందే తుది నిర్ణయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ స్పష్టీకరించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసిసి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు మొత్తంగా 162 మంది నేతల అభిప్రాయాలను ఈ మేరకు సేకరించామని మాణికం ఠాగూర్ వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్‌ గాంధీకి అందజేస్తానని మాణికం ఠాగూర్ వెల్లడించారు.

ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని ఠాగూర్ చెప్పుకొచ్చారు. పిసిసి ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉన్న వారు అధిష్టానానిన కలవొచ్చని మాణికం ఠాగూర్ చెప్పారు. ప్రజాదరణ లేని నాయకులే కాంగ్రెస్‌ను వీడుతున్నారన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలెవ్వరూ తమ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడరని మాణికం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. సంస్థాగతమైన లోపాల వల్లే జిహెచ్‌ఎంసీలో ఓటమి పాలయ్యామని మాణికం ఠాగూర్ పేర్కొంటూ.. అందుకు బాధ్యత వహిస్తూ జిహెచ్‌ఎంసి విభాగం అధ్యక్షుడు రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయ శక్తి అని ఆయన ప్రకటించారు.

Manickam Tagore to reacts on TPCC Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News