Thursday, May 2, 2024

అమెరికాలో మానుకోట యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

 మృతదేహం భారత్‌కు తీసుకురావడానికి అవరోధంగా మారిన న్యూ కరోనా స్ట్రెయిన్ నిబంధనలు
 కెసిఆర్, కెటిఆర్‌లు కృషి చేసి తమ కుమారుడి మృత దేహాన్ని తమ వద్దకు చేర్చాలని వేడుకోలు

మన తెలంగాణ/ మహబూబాబాద్ ప్రతినిధి: అమెరికాలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి మరణించిన వార్త పట్టణంలో వైరల్‌గా మారింది. అసలే కొత్త కరోనా వ్యాప్తి వార్తలు, అందులో మానుకోటకు చెందిన యువకుడు అమెరికాలో మృతి చెందడంపై పట్టణ ప్రజల్లో పలు ఊహాగానాలు చెలరేగాయి. వివరాలలోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ శ్రీనివాస్ రెడ్డి, శోభల కుమారుడు చంద్రపాల్ రెడ్డి(26) పై చదువుల కోసం 2015 సంవత్సరంలో అమెరికా వెళ్లాడు. పై చదువులు పూర్తి చేసి అక్కడే మంచి ఉద్యోగం దక్కించుకొని విధి నిర్వహణలో అమెరికాలోనే ఉంటున్న చంద్రపాల్ రెడ్డికి దురదృష్టవశాత్తూ ఈ నెల 23న గుండెపోటు సంభవించడంతో అతను మృతి చెందాడు. అయితే, చంద్రపాల్ రెడ్డి మృత దేహాన్ని ఇండియాకు తీసుకురావడం ప్రస్తుత కరోనా న్యూ స్ట్రేయిన్ వ్యాప్తి దృష్టా ఆగిపోయిన ఇండియన్ ఏయిర్‌లైన్స్ అడ్డంకిగా మారింది. చంద్రపాల్ రెడ్డి మృత దేహాన్ని ఇండియాకు రప్పించేదుకు గత ఐదు రోజులుగా తల్లిదండ్రులు, బందు మిత్రులు తీవ్రంగాప్రయత్నిస్తున్నప్పటికీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను వేడుకున్నప్పటికీ న్యూ కరోనా నిబంధనల రీత్యా తల్లిదండ్రుల ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు.

చంద్రపాల్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజు నుండే అమెరికాలో క్రిస్మస్ సెలవులు మొదలవడం, మృత దేహానికి అక్కడే పోస్ట్ మార్టమ్ తదితర కార్యక్రమాలు సైతం ఆలస్యం కావడం జరిగిందని సమాచారం అందుతోంది. తమ కుమారుడు చనిపోయి దాదాపు 5 రోజులు గడుస్తున్నప్పటికీ కడసారి తమ కుమారిడిని చూసి అంత్యక్రియలు జరపడానికి అవాంతరాలు ఏర్పడడంతో తల్లిదండ్రుల పుత్ర శోకానికి అవదులే లేవు. తమపై దయ ఉంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, తెరాస వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్‌లు కృషి చేసి తమ కుమారుడి మృత దేహాన్ని తమ వద్దకు చేర్చేలా కృషి చేయాలని కోరుతున్నారు చంద్రపాల్ రెడ్డి తల్లిదండ్రులు.

Manukota youth killed in America due to Heart Attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News