Monday, April 29, 2024

ఆ మూడు చట్టాలు ఎవరికి చుట్టాలు

- Advertisement -
- Advertisement -

Farmer strike against new farm bill

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లి కార్పొరేట్ సంస్థలైన నల్ల కుబేరులకు ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల సంపదను దోచి పెట్టేందకు కార్పొరేట్ సంస్థలు యథేచ్ఛగా భారత్‌లో వ్యాపార ప్రయోజనాల కోసం రైతాంగానికి వ్యతిరేకంగా అన్నదాతలకు నష్టం కలిగించడానికి అన్నదాతలు వ్యవసాయం నుండి వైదొలగాలని మోడీ ప్రభుత్వం భావించి మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఈ మూడు వ్యవసాయ చట్టాల వల్ల అటు రైతులకు ఇటు వినియోగదారులకు కలిగే లాభ నష్టాలు ఏవిధంగా ఉన్నాయో చూడండి.

మొదటి చట్టం

కాంట్రాక్టు వ్యవసాయం అంటే రైతు కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం. దీని వల్ల రైతులకు నష్టం దీనిలో 19 సెక్షన్లు ఉన్నాయి. వీటి వల్ల ఆ చట్టం రైతులకు జరుగుతున్నటువంటి ఏమిటి అనగా రైతులు కార్పొరేట్లు కుదుర్చుకున్న ఒప్పంద కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల పాటు నిర్ణయించుకున్న ధర అమలు జరపాలి లేదా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ధర నిర్ణయించు కోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి నిర్ణయించదు. కొనుగోళ్లలో జరిగే లావాదేవీల తగాదాలు పట్టించుకోదు. అక్కడే ఒక కలెక్టర్ ఉంటాడు. అప్పిలేటు కలెక్టర్ చివరికి అతను కనుక వినకపోతే ఊరుకోవాల్సిందే. సివిల్ కోర్టుకు వెళ్లే హక్కు లేదు. అలాగే మార్కెట్‌లోకి వెళ్లకుండా రైతులు కార్పొరేట్లతో ఒప్పందం చేసుకోడం వల్ల కార్పొరేట్ సంస్థలు ఏ పంట పండించమంటే ఆ పంటలే పండించాలి.

కార్పొరేట్ సంస్థలు ఎగుమతి ఆధారిత పంటలు మాత్రమే రైతులను పండించమంటారు. ఆహార ధాన్యాలు పండించ వద్దంటారు. ఆహార ధాన్యాలు వద్దంటే రైతులు మానుకోవాలి, వేరే గత్యంతరం లేదు. కార్పొరేట్ సంస్థలు కోరిన పంటలే పండించాలి. ఆ పంటలు పండించడానికి కార్పొరేట్ సంస్థలు లేమన్నా డబ్బులిస్తే ఆ డబ్బులతో పంటలు పండిస్తే ఒక వేళ ప్రకృతి వైపరీత్యాల అధిక వర్షాలు, అనావృష్టి వల్ల పంట దెబ్బ తింటే ప్రకృతి వైపరీత్యాల నష్ట పరిహారం ఎవరు ఇవాలి అనేది లేదు. ఆ పంటలు గనక దెబ్బ తింటే ఆ రైతు నష్టపోతే బాకీ కింది రైతు కార్పోరేట్ సంస్థకు అప్పగించాలి ఇది నిబంధన. కానీ భూమి మీద ఇప్పుడు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. బలవంతంగా కార్పొరేట్ సంస్థలు రైతుకు అప్పు ఇచ్చి డిగ్రీ ద్వారా రైతు దగ్గర భూమిని లాక్కుంటారు. దీన్ని ఎవ్వరూ ప్రశ్నించే హక్కు లేదు ఆపలేరు. ఇది మొదటి చట్టం.

రైతులు కార్పొరేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా రైతు పండించిన పంటకు నిర్ణయించిన ధర మార్కెట్ లో గనుక ఎక్కువ ఉంటే తీసుకుంటారు మార్కెట్‌లో తక్కువ ఉంటే పంట నాణ్యతా పరిమాణాలు చెప్పి కార్పొరేట్ సంస్థలు తీసుకోవడానికి రిజెక్ట్ చేస్తుంది. ఇదెక్కడి న్యాయం అని అడిగే హక్కు రైతుకు లేదు. కార్పొరేట్ సంస్థలు చెప్పిన పంటలు మాత్రమే రైతులు వెయ్యాలి అది మోనో క్రాఫ్ సిస్టం మాత్రమే వెయ్యాలి అంటే లక్షల ఎకరాల పంటలు వేయ్యాలి. బహుళ పంటల విధానం ఇక ఉండదు. కాబట్టి డబ్బులు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉండదు. రైతు పండించే పంటలకు పెస్టి ఎటాక్ తగిలితే మాత్రం పరిహారం ఇచ్చేది చట్టంలో లేదు. రూల్సు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే చెయ్యాలి ఇది మొదటి చట్టం సారాంశం.

రెండవ చట్టం మార్కెట్లు రద్దు చట్టం

అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్‌లలో సెక్రటరీ గాని అక్కడ ఉన్నటువంటి మార్కెట్ సిబ్బంది గాని రైతు మార్కెట్ లోకి తెచ్చిన సరుకును అమ్మిపెట్టి రైతుకు న్యాయంగా అమ్మిగా వచ్చే డబ్బును రైతు చేతికి ఇచ్చేటటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అటువంటి బాధ్యత ఉండదు ఎందుకూ ఏమిటి అని అడిగే ప్రసక్తే లేదు. అసలు మార్కెట్‌లో సిబ్బందే ఉండరు. మార్కెట్లో ఇప్పుడు ఆ 1% కమీషన్ వసూలు చేయడం వల్ల భారత దేశంలో ఉన్న 6500 మార్కెట్లో మొత్తంగా దాదాపు 35 నుంచి 40 వేల మంది పని చేస్తున్నారు. మార్కెట్ లో ఉద్యోగులు వారి వేతనాలు పోగా తెలంగాణ మార్కెట్లో అయితే 300 కోట్లు మిగులు ఆదాయాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ మార్కెట్‌లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఉంటారు. అంటే దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులను తీసి వేసి రైతులకు ఎలాంటి రక్షణ లేకుండా చేస్తారు.
మార్కెట్‌లోకి సరుకు వచ్చిన తర్వాత మార్కెట్లో కార్పొరేట్ సంస్థలు నియమించిన గుమాస్తాలు ఎవరైతే ఉన్నారో వారు నిర్ణయించేదే ధర తిరిగి ఎంఎస్‌పి నిర్ణయం లేదు. కానీ ఎంఎస్‌పి నిర్ణయం చేస్తానంటుంది. కానీ అది రాతపూర్వకంగా కాదట. ఇప్పుడు ఏదైతే నోటి మాటగా నడుస్తుందో అలాగే నోటి మాటగానే చేస్తాం అంటున్నారు. నోటి మాట అంటే ఇవ్వాళ ఉంటుంది రేపు పోతుంది. చట్టాలే అమలు జరగనటువంటి ఈ రోజుల్లో నోటి మాటలు ఎక్కడ అమలు జరుగుతాయి. అందువల్ల మార్కెట్లు గనుక రద్దు అయితే కొనుగోలుదారులకు స్వేచ్ఛ కల్పించడం తప్ప రైతులకు స్వేచ్ఛ కాదు. రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా రైతు పండించిన పంట తన భూమి నుంచి పది కిలోమీటర్ల దూరం తీసుకుపోయి అమ్ముకోలేడు సరుకు ప్రాసెస్ చేసేవాడు కాదు కాబట్టి అదనపు ఆదాయం వచ్చే అవకాశం లేదు.

మూడవ చట్టం, నిత్యావసర సరుకుల చట్టం

నిత్యావసర సరుకుల చట్టంలో మన ఆహార ధాన్యాలు పప్పులు, నూనె గింజలు, ఉల్లిపాయ, ఆలుగడ్డలు ఇవి ఉన్నాయి, వీటిని తొలిగించేశారు. ఈ తొలిగింపులు అంటే ఏమిటి వీటి మీద ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. సరుకు ఎన్ని వేల టన్నులైనా నిల్వ పెట్టుకోవచ్చు.

ఈ చట్టం తొలిగించిన మొదటి నెలలో సెప్టెంబరులో చట్టం అయింది జూన్ లో ఆర్డినెన్స్ వచ్చింది. చట్టం అయిన నెలలో 20 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డల ధర 80 రూపాయలకు పోయింది. 65 రూపాయలు ఉన్న పప్పు ధాన్యాలు ధర 135కు పోయినవి. విపరీతంగా స్టాక్ నిల్వ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా ఆపేసారు కార్పొరేట్ సంస్థలు.

వీటిని లాభాపేక్షతో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలంటే అవి సేవా దృక్పథంతో ఉం టాయి. అందువల్ల ప్రభుత్వ రంగంలో ఉండాలని రైతులు, ప్రజలు కోరుకుంటారు. లాభాపేక్షతో ఉన్నటువంటి సంస్థలు ఎదుటివారు ఎంత చితికిపోయిన ఆకలి చావులకు గురైనా కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం కనికరం ఉండదు. అసలు వారికి మనసే ఉండదు, వారికి లాభాలు ఎంత వచ్చిందనేదే చూసుకుంటారు.
అందువల్ల నిత్యావసర సరుకుల చట్టం అటు వినియోగదారులకు, ఇటు ఉత్పత్తిదారులకు ఇద్దరికీ నష్టం కలిగిస్తుంది. కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తిదారుల దగ్గర మాత్రం అతి తక్కువ ధరలకు కొంటారు. వినియోగదారులకు మాత్రం 10, 15 రెట్లు అధిక ధరలు నిర్ణయించి అమ్ముతారు. ఎవరూ అడిగే నాథుడే లేరు. కాబట్టే రైతులు గ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధానిని ముట్టడించారు. ఢిల్లీలో ప్రస్తుతం మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎముకలు కొరికే చలిలో రైతులు చెక్కు చెదరక ప్రాణాలుపోతున్నా ఆలోచించకుండా ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. రైతాంగానికి వ్యతిరేకంగా రైతులను వ్యవసాయం నుండి బయటకు పంపించే విధానం తప్ప మరొకటి కాదు. ఇటువంటి మూడు చట్టాలను రైతులు అంగీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం రైతులకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు నష్టం కలిగించే ఈ మూడు చట్టాలు నిత్యావసర సరుకుల చట్టం, మార్కెట్ల రద్దు చట్టం, వ్యవసాయం కాంట్రాక్టు ఒప్పంద చట్టాలు రద్దు తప్ప మరో మార్గం లేదు.

మందా వెంకటేశ్వర్లు
(ఎఐటియుసి టిఎస్ ప్రధాన కార్యదర్శి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News