Friday, May 3, 2024

దంతెవాడలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు హతం

- Advertisement -
- Advertisement -

Maoist killed in Encounter in Chhattisgarh's Dantewada

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, మరికొంత మంది మావోయిస్టుల కూడా చనిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నిత్యావసర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఇటీవల ఛత్తీస్‌గడ్‌లో నక్సల్స్-జవాన్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 24 మంది జవాన్లు మృతి చెందగా.. 31 మందికి గాయాలపాలయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. మావోయిస్టుల చర్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల చర్యను ఖండించారు. మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ ప్రకటించారు. అధికారులు సైతం ఈ ఘటనతో అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
ఐదు వాహనాలకు నిప్పు:
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో విధ్వంసం సృష్టించారు. బీజాపూర్ జిల్లా నెమేడ్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాలను తగలబెట్టారు. తమ ఉనికి చాటుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. నెమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మింగాచెల్‌లో నిర్మిస్తున్న వాటర్ ఫిల్టర్ వద్ద 5 వాహనాలను తగలబెట్టారు.కొంత కాలంగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతుండగా మావోయిస్టులు ఇవాళ ఈ ఘటనకు పాల్పడ్డారు.తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Maoist killed in Encounter in Chhattisgarh’s Dantewada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News