Friday, April 26, 2024

ఆపరేషన్ చేయూత ద్వారా జనజీవన స్రవంతిలోకి మావోలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ కొత్తగూడెం: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ పట్ల ప్రజల్లో ముఖ్యంగా దళం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని పెద్ద ఎత్తున మావోల లొంగుబాటు ఇందుకు నిదర్శనమని భద్రాద్రి జిల్లా ఎస్‌పి డాక్టర్ వినీత్ అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి డివిజన్, మణుగూరు ఎల్‌వోఎస్( మణుగూరు,పాల్వంచ ఏరియా కమిటీ) సభ్యులు సంగెపు మహేష్ లొంగిపోయినట్లు ప్రకటించారు. 2012 నుంచి 2022 వరకు మిలిషియా సభ్యుడు నుంచి దళ సభ్యుడుగా ఎదిగాడని వివరించారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులను చర్ల పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని దీనికి ప్రభావితుడై పోలీస్ అధికారుల ఎదుట సరెండర్ అయినట్లు పేర్కొన్నారు.

గత కొంత కాలంగా మావోల హింసాకాండను తట్టుకోలేక పెద్ద ఎత్తున జన జీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమవుతున్నారని, వరుస లొంగుబాట్లు, అరెస్టులతో ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిందని తెలిపారు. మోసపూరిత ప్రకటనలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అమాయక గిరిజనాన్ని ఆకర్షిస్తూ తీరా దళంలో చేరాక వారితో వెట్టి చాకిరి చేయిస్తూ అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకుంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తమ శాఖ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. మిగిలిన దళ సభ్యులు కూడా అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ల వద్ద లొంగిపోవాలని ప్రభుత్వం అందించే పునరావాసాన్ని అందిపుచ్చుకుని సాధారణ జీవితం గడపాలని సూచించారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి సాయి మనోహర్, భద్రాచలం ఎఎస్‌పి పరితోష్ పంకజ్ అడిషనల్ కమాండెంట్, కమల్ వీర్ యాదవ్, సునీల్ కుమార్, చర్ల సిఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News