Sunday, April 28, 2024

సంవత్ 2077 చివరి రోజునా… నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు !

- Advertisement -
- Advertisement -

Market ended in Red

 

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సంవత్ 2077 సంవత్సరపు చివరిరోజున(బుధవారం) నెగటివ్‌లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లలో అమ్మకాల జోరు బాగా కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257.14 పాయింట్లు లేదా 0.43 శాతం పడిపోయి 59771.92 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 59.80 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 17829.20 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ సైతం 536.40 పాయింట్లు లేదా 1.34 శాతం నష్టపోయి 39402.05 వద్ద ముగిసింది. మార్కెట్‌లో 1509 షేర్లు లాభపడగా, 1662 షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. కాగా 143 షేర్లు లాభనష్టాలు లేకుండా యథాతథంగా ఉండిపోయాయి.
నిఫ్టీలో ఎల్‌అండ్‌టి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యుపిఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడగా, సన్‌ఫార్మ, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకుర నష్టపోయాయి. సెక్టారల్ పరంగా చూసుకున్నట్లయితే ఆటో, బ్యాంకు రంగాలు 1 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 2 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు పాజిటివ్‌గానే ఓపెన్ అయినప్పటికీ తర్వాత సైడ్‌వేస్‌లో కదలాడాయి. అయితే ఫెడ్ పాలసీ ప్రకటన రానున్న నేపథ్యంలో తర్వాత ప్రపంచ మార్కెట్ సూచీలు బలహీనంగా ట్రేడయ్యాయి. దాంతో చివరికి దేశీయ మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News