Sunday, April 28, 2024

మణిపూర్ ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మైతీ, కుకీల మధ్య గత మే నుంచి జరిగిన ఘర్షణల్లో సుమారు 200 మంది మృతి చెందారు. ఈ రెండు వర్గాల ఘర్షణకు చురచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాల సరిహద్దు కేంద్ర బిందువైంది. అప్పటినుంచి సుమారు ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీల్లో మృతదేహాలు మూల్గు తున్నాయి. చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లోని మార్చురీల్లో మృతదేహాలను ఇటీవల హెలికాప్టర్ల ద్వారా తరలించారు. భారీ భద్రత మధ్య సామూహిక ఖననం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News