Monday, April 29, 2024

తమిళనాడు మంత్రి కె పొన్ముడిని తొలగించాలని గవర్నర్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరో వివాదం రాజుకుంది. కే పొన్ముడిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్‌ఎన్. రవి తాజాగా డిమాండ్ చేశారు. అక్రమ ఆస్తుల కేసులో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడిని నిర్దోషిగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. ఆయనతోపాటు భార్యను గురువారం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ అంశంలో పొన్ముడి అపీల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

ఇదిలా ఉండగా, పొన్ముడి వ్యవహారంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరోసారి జోక్యం చేసుకున్నారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాజాగా డిమాండ్ చేశారు. మరోవైపు బిల్లులను పెండింగ్‌లో ఉంచడంపై గవర్నర్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గతనెలలో సుప్రీం కోర్టు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్, సిఎం కలిసి కూర్చొని పెండింగ్ బిల్లుల విషయంపై చర్చించి పరిష్కరించుకోవాలని తాజాగా సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News