Thursday, May 2, 2024

అచ్చంపేటలో 140 జంటలకు సామూహిక వివాహాలు….

- Advertisement -
- Advertisement -

Mass weddings in achampet

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గిరిజనులలో చైతన్యం తెస్తూ సమ సమాజంలో తాము కూడా భాగమేనని ఒక్క నానుడిని వినిపిస్తూ దేశ ఆర్థికరంగంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ అనాదిగా వస్తున్న వాళ్ళ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న సంస్థ వనవాసీ కళ్యాణ పరిషత్ అని రాష్ట్ర ప్రచార ప్రముఖ్ జిఎస్ చలపతి తెలిపారు.  గిరిజనులకు వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలు ఉన్నాయని, గిరిజన సమాజంలో వివాహం అత్యంత ముఖ్యమైన పవిత్ర బంధం అని, పెళ్లంటే నూరేళ్ల పంట అని, ఇద్దరితో కుటుంబ నిర్మాణం, కుటుంబాల సమూహం, సంఘం మూడడుగులు, ఏడడుగులతో మొదలైన దాంపత్యం జీవితాంతం సాగుతుందన్నారు. ఈ హిందూ వివాహ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని, ఈ సంప్రదాయాన్ని పాశ్చాత్యులు కూడా పాటిస్తున్నారని, అద్భుతమైన వివాహ వేడుకలు ఖర్చుతో కూడుకున్నవని పేర్కొన్నారు.

పురాతన తెగ చెంచులు నల్లమల అడవులలో నివసిస్తున్నారని, శ్రీశ్రీశ్రీ అహోబిల చెంచు లక్ష్మీ నరసింహస్వామి, శ్రీశ్రీశ్రీ శ్రీశైల మల్లికార్జునస్వామిని చెంచుల అల్లుళ్ళుగా పిలుస్తారని, చెంచులలో చాలామంది సంపదలో పేదవారు ఉన్నారని, పేదరికం కారణంగా వారికి పెళ్లిళ్లు లేక పిల్లలు పుట్టడం చాలా కష్టంగా ఉందన్నారు. వివాహాలు కూడా కుల పెద్దల ఆశీస్సులకే పరిమితమవుతున్నాయని, ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది చెంచులు పెళ్లి వేడుక జరుపుకోలేక పోతున్నారపి ఆవేదన వ్యక్తం చేశారు.

వనవాసి కళ్యాణ పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా కష్టాల్లో ఉన్న చెంచులకు “సామూహిక వివాహాలు” నిర్వహించాలని నిర్ణయించారని, రెండు జిల్లాల్లోని ఆరు మండలాల్లోని 31 చెంచుగూడెంలలో సుమారు 140 జంటలను ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమం 30 అక్టోబర్, 2021 శనివారం శ్రీశైలం దారిలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రసంగించనున్నారన్నారు.

ఇతర పెద్దలు కన్యాదాతలుగా, అతిథులుగా పాల్గొంటున్నారని, మారుమూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ మహోన్నత కార్యక్రమాన్ని మీడియా ద్వారా తెలియజేసే అవకాశాన్ని కల్పించేందుకు కోసమై మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జేష్ఠ ప్రచారకులు, వానవాసీ కళ్యాణాశ్రమ్ అఖిల భారత అధికారి కొరిగింజ రామచంద్రయ్య, శ్రీ దేవేందర్ రావు తెలంగాణ కార్యదర్శి పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొని వనవాసి కళ్యాణ పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమాల పైన  మాధ్యమాలలో కొంత సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News