Monday, November 4, 2024

మ్యూజికల్ హిట్‌గా ‘తస్సాదియ్యా..’

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మట్కా’ నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ ఈ సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్న మ్యూజిక్ మట్కాకి వన్ అఫ్ ది మేజర్ హైలెట్. తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్- తస్సాదియ్యా దీనికి నిదర్శనం. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెట్రో బీట్స్, పవర్‌ఫుల్ కంపోజిషన్‌తో వచ్చిన సెకండ్ సింగిల్ తస్సాదియ్యా ఇన్‌స్టంట్ హిట్‌గా అలరించింది. వరుణ్ తేజ్ ఈ పాటలో ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News