Thursday, May 2, 2024

భారత్‌లో 50లక్షల కరోనా మరణాలు!

- Advertisement -
- Advertisement -

May be close to 50 lakh corona deaths in India: US Study

భారత్‌లో 50లక్షల కరోనా మరణాలు!
అమెరికా పరిశోధనా సంస్థ నివేదిక
ప్రస్తుతం నమోదైన వాటికన్నా పది రెట్లు అధికం

న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా మరణాలు 4లక్షలకు పైగా.. అయితే అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ మాత్రం అంతకు 10రెట్లు మరణాలు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక నివేదిక విడుదల చేసింది. భారత్‌లో కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం చెప్పిన లెక్కలలకు, వాస్తవ గణాంకాలకు మధ్య కనీసం 34లక్షల నుంచి 47 లక్షల మేరకు తేడా ఉంటుందని మంగళవారం విడుదల అధ్యయనంలో సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అంచనా వేసింది. భారత్ లో కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, వాస్తవ గణాంకాలకు మధ్య కనీసం 34 లక్షల నుంచి 47 లక్షల మేర తేడా ఉంటుందని నివేదికలో తెలిపారు. జూన్ 21 వరకు భారత్ లో సంభవించిన అదనపు మరణాలను అంచనా వేసేందుకు మూడు భిన్న సమాచార వనరులను అధ్యయనంలో ఉపయోగించారు.

అందులో మొదటగా.. దేశ జనాభాలో సగం వాటాను కలిగిన ఏడు రాష్ట్రాల్లోని జనన, మరణాల నమోదును పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. భారత్ లో కరోనా ఆనవాళ్లు ఉన్న రక్త పరీక్షల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేట్లను రెండో విధానంగా తీసుకున్నారు. ఏడాదిలో రెండు సార్లు జరిగే ఆర్థిక సర్వేలో పాల్గొన్న 9 లక్షల మంది వివరాలను పరిశీలించారు. గత నాలుగు నెలల కాలంలో ఆయా కుటుంబాలలో ఎవరైనా కరోనాతో మరణించారా అనే విషయాలను సేకరించారు. వీటిన్నింటినీ పరిశీలించిన అనంతరం భారత్‌లో ప్రభుత్వం చెప్పిన లెక్కలకంటే అదనపు మరణాలు 34 లక్షల నుంచి 47 లక్షల వరకు ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. భారత్‌లో మరణాల అసలు లెక్క మిలియన్లలో ఉంటుందని.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదం కరోనానే అని నివేదికలో పేర్కొన్నారు.

May be close to 50 lakh corona deaths in India: US Study

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News