Friday, April 26, 2024

న్యూయార్క్ సిటీ మేయర్ తో భేటీ అయిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : నగర మేయర్ గద్వాల్ విజయలక్మి గుడ్‌విల్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో మంగళవారం భేటీ అయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్థంతి సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి న్యూయార్క్ సిటీ హాల్‌లో నివాళులు అర్పించారు. అనంతరం ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం పురాతన కాలం నుండి నేటీకి ప్రసిద్ది చెందడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతూ అంతర్జాతీయ స్ధాయిలో ప్రసిద్ది చెందుతుందన్నారు.

అదే విధంగా మేయర్ విజయలక్ష్మి ప్రసంగిస్తూ మహానగరం సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ద్వారా భౌతికంగా అభివృద్ది చెందిన సిటీలతో పరస్పర సహకారం, బిజినెస్‌లో అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇంతకు ముందు కాలిఫోర్నియా సిటీ హైదరాబాద్ నగరంతో సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ఎం.ఓ.యు ఒప్పందం చేసుకుని ఇరు నగరాలరకు సంబంధించిన సంస్కృతి, అకాడమీ పరంగా పరస్పర అవకాశాలపై సహాయం తీసుకున్నట్లు తెలిపారు. ఆడమ్స్ ఏప్రిల్ 30లోపు హైదరాబాద్ నగరానికి విచ్చేసి వీక్షించాలని, ఇక్కడ అభివృద్ది చెందిన ప్రదేశాలను, సిస్టర్ సిటీ రిలేషన్‌షిప్‌లో భాగంగా ఎంఓయు ప్రకారం టెక్నాలజీ, ఇతర పరస్పర మార్పిడి ఒప్పందం చేసుకోవాలని గద్వాల్ విజయలక్ష్మి న్యూయార్క్ మేయర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News