Monday, May 13, 2024

వైద్యానికి నైవేద్యం

- Advertisement -
- Advertisement -

Medical Services

 

రూ. 69,000 కోట్లు కేటాయింపు
ప్రధాని జన ఆరోగ్యయోజన (పిఎంజెఎవై) కే రూ.6400 కోట్లు
ఆయుష్మాన్ భారత్‌లో కృత్రిమ మేధస్సుతో వైద్యసేవలు
మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి

న్యూఢిల్లీ : వైద్య రంగానికి రూ.69,000 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పిఎంజెఎవై)కు రూ.6400 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ఈ పిఎంజెఎవై కిం ద 20,000 ఆస్పత్రులు ఉన్నాయని చెప్పారు. గత ఏడాది ఆరోగ్య, కుటుంబ సంక్షేమం కింద రూ.62, 659. 12 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ. 65,011.8 కోట్లకు కేటాయింపు పెంచారు. వైద్య పరిశోధనకు రూ.2100 కోట్లు కేటాయించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.2122.08 కోట్లు కేటాయించారు. పిఎంజెఎవై కింద టైర్ 2,టైర్3 నగరాల్లో పేద ప్రజలకు వైద్యఅవసరాలు ఎంతో పెంచాల్సి ఉన్నందున ప్రైవేట్‌పబ్లిక్ పార్టనర్‌షిప్ (పిపిపి) పద్ధతిలో ఆస్పత్రులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్టు సీతారామన్ చెప్పారు.

ఆయుష్మాన్ ఆస్పత్రులు లేని జిల్లాల్లో మొదటి దశలో ఈ ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు వివరించారు. దీనివల్ల యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, పన్నుల ద్వారా వచ్చే ఆదా యం వైద్య సదుపాయాల కోసం వినియోగిస్తామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌లో కృత్రిమ మేథస్సును వినియోగించి ముందుగా వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడమౌతుందని చెప్పారు. ‘టిబి హరే గా… దేష్ జీతేగా’ (క్షయ ఓడాలి.. దేశం గెలవాలి) అన్న ప్రచారోద్యమం ప్రారంభమైంది. 2025 నాటి కి క్షయ పూర్తిగా అంతరించేలా మన లక్షాలు అంకి తం కావాలని, ఇలాంటి ప్రయత్నాలు బలోపేతం కాడానికి తాను ప్రతిపాదిస్తున్నానని సీతారామన్ పేర్కొన్నారు.

జన ఔషధి కేంద్ర పథకం లో 2000 ఔషధాలు, 300వైద్య పరికరాలు 2024 నాటికి సమకూరి ఈ పథకం అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్టు చెప్పారు. వైద్య సేవల్లో వనరులు పెంపొందడానికి, స్వదేశీ పరిశ్రమను ప్రోత్సహించడానికి వైద్యపరికరాల దిగుమతులపై నామమాత్రపు వైద్యసెస్సు 5 శాతం విధించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇంద్రధనుష్ మిషన్ పరిధి కింద 12 రకాల వ్యాధులకు చికిత్స జరిగేలా విస్తరిస్తున్నామని, ఇందులో కొత్తగా 5 వ్యాక్సిన్లను చేర్చడమైందని చెప్పారు.

Medical Services with Artificial Intelligence
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News