Monday, April 29, 2024

జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం

- Advertisement -
- Advertisement -
metro
రెండో వారంలో పరుగులు

హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్‌వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ నవంబర్ 28 నుంచి కొనసాగుతోంది. ఇప్పటికే నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కారిడార్‌తో పాటు మొదటి ఎల్‌బినగర్ నుంచి మియాపూర్ వరకు కారిడార్ విజయవంతంగా మెట్రో పరుగులు పెట్టిస్తూ 57కి.మీ రాకపోకలు సాగిస్తున్నారు. కొత్త కారిడార్‌తో అదనంగా మరో 11 కి.మీ రైల్ ప్రయానించడంతో 68కి.మీ మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ నుంచి మొదలుకొని అన్ని స్టేషన్లు తనిఖీ పూర్తి చేసి అమతులిచ్చారు. అతిపెద్ద ఇంటర్ చేంజ్ స్టేషన్ ఎంజీబిఎస్ ఇంటర్ చేంజ్ స్టేషన్ పనులు పూర్తి చేశారు.

కారిడార్,1,2లను కలుపుతూ నిర్మించే ఈ నిర్మాణం పలు ప్రత్యేకతలు కలిగి ఉన్నదని మెట్రో అధికారులు తెలిపారు. 58 ఫిల్లర్లు, 6గ్రిడ్స్‌తో పూర్తిస్దాయి స్టీల్,నాణ్యమైన సిమెంటు కాంక్రీట్‌తో స్టేషన్లు నిర్మించారు. ఎల్‌బినగర్ మార్గంలో ప్రయానించే కారిడార్ 1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ మొదటి, రెండో అంతస్తుల నుంచి రాకపోకడలు సాగిస్తుండగా, కారిడార్ 2 జెబిఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో రైళ్లు 3, 4 అంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. స్టేషన్ల విషయానికి కొస్తే పరేడేగ్రౌండ్, సికింద్రాబాద్‌వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్‌టిసి క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజిబిఎస్ వంటి స్టేషన్లలో నడుపుతారు. 16 నిమిషాల్లో 11కి.మీ చేరుకునేలా ఈ మార్గంలో మెట్రో కొనసాగనుంది. రోడ్డు మార్గంలో ఇతర వాహనాల ద్వారా వెళ్లాలంటే సుమారు గంట సమయం పడుతుంది. అత్యంత రద్దీ ప్రాంతంగా ఉన్న ఈ మార్గంలో మెట్రో ప్రయాణం కూత మోగనుంది.

Metro to run between JBS and MGBS Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News