Friday, May 3, 2024

మేడిగడ్డ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: స్వాతంత్ర భారతదేశం లో ఇంత పెద్ద కుంభకోణం ఇంకోటి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.  సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎఎల్ఎల బృందం కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  94 వేల కోట్ల ఖర్చుతో 90 వేల ఎకరాలకు నీళ్ళించారని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రాజెక్ట్ కట్టారని, 38 వేల కోట్ల ప్రాజెక్ట్ ను రీడిజైన్ పేరుతో 94 వేల కోట్ల ఖర్చు పెట్టారని ధుయ్యబట్టారు. ఇంకా 30 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని, బ్యారేజ్ కట్టి నీటిని నిల్వ చేసి ఎన్నికల ముందు పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. ఇది భారీ కుంభకోణమని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అక్టోబర్ 21న ప్రమాదం జరిగితే ఈ రోజు వరకు కూడా కెసిఆర్ ఒక్క మాట మాట్లాడలేదని,  నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు ముందే చెప్పారని, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజక్ట్ అని తెలిపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. పూర్తీ సమాచారంతో డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలతో ముందుకు పోతామని పేర్కొన్నారు.  94 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృదా చేసి నామ మాత్రపు కొత్త ఆయకట్టు తయారు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News