Monday, May 13, 2024

ముంబయి తరహా పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర

- Advertisement -
- Advertisement -
Men held for terror plot were told to plan attack like 1993
ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన పాక్ ప్రేరేపిత ఉగ్ర ముఠాను దర్యాప్తు చేసే కొద్దీ పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాబేయే పండగల సీజన్‌లో భీకర దాడులకు పాల్పడేందుకు వీరు కుట్రలు పన్నిన విషయం తెలిసిందే. కాగా 1983 నాటి ముంబయి వరస పేలుళ్ల దాడులకు ఈ ముష్కరులు ప్రణాళికలు వేసినట్లు తాజాగా తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా వీరు ఎంచుకున్నట్లు ఢిల్లీ పోలీసు ప్రత్యేక వర్గాలు గురువారం వెల్లడించాయి. నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో గత మంగళవారం మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన ఢిల్లీప్రత్యేక విభాగం పోలీసులు ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, రాజస్థాన్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వీరిని అనేక కోణాల్లో ప్రశ్నించగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. ఈ ఉగ్రవాదులకు రైల్వే ట్రాక్‌లు, బ్రిడ్జీలు పేల్చడంలో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తెలిసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అరెస్టు చేసిన వారి వద్దనుంచి 1.5 కిలోల ఆర్‌డిఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, పెద్ద ఎత్తున విధ్వసం సృష్టించడానికి ఈఆర్‌డిఎక్స్ సరిపోతుందని ఒక అధికారి చెప్పారు.

వీరంతా 1993 నాటి ముంబయి తరహా పేలుళ్లు జరపడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడయిందని కూడా ఆ అధికారులు తెలిపారు. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ రెక్కీ కూడా నిర్వహించినట్లు కూడా తెలిసింది. కాగా ఢిల్లీలో అర్టెయిన ఇద్దరు ఉగ్రవాదులు జీషాన్, ఒసామాలు సముద్ర మార్గం ద్వారా పాకిస్థాన్ వెళ్లి వచ్చారని కూడా తెలిసింది. విచారణలో కొందరు స్లీపర్ సెల్స్ పేర్లను కూడా వీరు వెల్లడించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు కూడా చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులను కలవడం కోసం మహారాష్ట్ర ఎటిఎస్ బృందం ఢిల్లీ వచ్చిందని, అనుమానితులను సంయుక్తంగా విచారించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News