Saturday, April 27, 2024

సింగరేణి రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి సంస్థ ఈనెల 8న నిర్వహించనున్న ఫిట్టర్ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రాల్లో చేస్తున్న పకడ్బందీ ఏర్పాట్లలో భాగంగా రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాక్ త్రూ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను వాక్ త్రూ మెటల్ డిటెక్టర్ ద్వారా పరీక్షించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. అభ్యర్థుల పాదం నుంచి మొదలు తల వరకు ఎక్కడ ఎటువంటి సూక్ష్మమెటల్ వస్తువు ఉన్నా మెటల్ డిటెక్టర్ ఇట్టే పట్టేస్తుంది. ఈ తరహా మెటల్ డిటెక్టర్లను విమానాశ్రయాలలో తనిఖీ కోసం వినియోగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పరీక్షలు రాసే అభ్యర్థులలో కొందరు అక్రమాలకు పాల్పడకుండా నివారించేందుకు అత్యాధునిక డిజిటల్ సాంకేతికత వినియోగించి డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అతి సూక్ష్మ బ్లూ టూత్, చిప్ లను శరీరంలోని ఏ భాగంలో దాచినా సరే డిటెక్టర్లు గుర్తించి బీప్ శబ్దం తో వెంటనే అప్రమత్తం చేస్తాయి. 128 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న రాత పరీక్షకు సింగరేణి సంస్థ కొత్తగూడెంలో 5 పరీక్ష కేంద్రాలలో పూర్తి ఏర్పాట్లు చేసింది. 2,681 మంది పరీక్షకు హాజరు కానున్నారు. సింగరేణి మహిళా డిగ్రీ, జూనియర్ కళాశాలలో రెండు కేంద్రాలు, సింగరేణి హైస్కూల్, సెయింట్ మేరీస్ స్కూల్, అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లను నెలకొల్పామని జిఎం(సెక్యూరిటీ) కుమార్ రెడ్డి తెలిపారు.

ఈక్రమంలో డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరామ్ శుక్రవారం వీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరామ్ మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ఖర్చుకు వెనకాడకుండా కంపెనీ ఇటువంటి ఏర్పాట్లు చేస్తుందని, పరీక్షలు రాసిన వెంటనే ఫలితాలు వెల్లడిరచనున్నామని, కేవలం రాత పరీక్ష లో చూపిన ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుందని పైరవీలకు ఏ మాత్రం తావు లేదని, అభ్యర్థులెవరూ ఎవరూ ప్రలోభాలకు లోనుకావొద్దని సూచించారు.ఎవరైనా మధ్యవర్తులుగా చెప్పుకొని మోసపూరిత మాటలతో డబ్బు వసూళ్లకు పాల్పడాలని ప్రయత్నిస్తే అటువంటి వారిపై తగు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News