Sunday, April 28, 2024

శరవేగంగా మెట్రో డిపిఆర్

- Advertisement -
- Advertisement -

ఫేజ్ 2 కారిడార్ కోసం వేగంగా ట్రాఫిక్ సర్వేలు, డిపిఆర్‌ల తయారీ సిద్ధం
పెట్టుబడులను ఆకర్షించేందుకు మెట్రో సేవలు దోహదం
70 కిలోమీటర్ల మేర రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం
మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెట్రో రెండోదశ విస్తరణ ప్రతిపాదనలకు సిఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా ఫేజ్ 2 కారిడార్ కోసం వేగంగా ట్రాఫిక్ సర్వేలు, డిపిఆర్‌ల తయారీ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రాజధానిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మెట్రో సేవలు దోహదం పడతాయని ఎండీ పేర్కొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని కలుపుతూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎండి ఎన్వీఎస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడి అమరులైన త్యాగమూర్తులకు నివాళులర్పించి, హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రగతి గురించి ఆయన వివరించారు. ఫేజ్ 2లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవి ఆకర్షణీయం అవుతాయని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ ఇంజనీర్లు, ఉద్యోగులు తమను తాము పునరంకితం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News