Monday, April 29, 2024

రవాణాకు రాచబాట

- Advertisement -
- Advertisement -

మూడోదశలో 278 కి.మీలు….రూ.69,100 కోట్ల ఖర్చు

హైదరాబాద్: ఔటర్‌తో పాటు మరిన్ని ప్రాంతాలకు మెట్రోరైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో మూడో దశ విస్తరణలో భాగంగా మియాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట్ వరకు, ఉప్పల్ నుంచి బీబీనగర్, దీంతోపాటు ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రోను చేపట్టడంతో పాటు జేబిఎస్ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 278 కి.మీల మేర కొత్తగా మెట్రోను పూర్తి చేయడానికి మొత్తం రూ.69,100 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం పేర్కొంది.ఈ పనులన్నీ దాదాపు మూడు నుంచి నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రో ఉండగా దానికి అదనంగా 31 కి.మీల మేర శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మూడేళ్లలో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు మూడోదశ మెట్రో పనులు పూర్తయితే ఔటర్ చుట్టూ మెట్రో విస్తరణ పూర్తి కానుంది.

మెట్రో ఎక్స్‌టెన్షన్ కారిడార్స్ వివరాలు ఇలా…
మెట్రో కారిడార్స్ ప్రపోజల్స్ కి.మీలు స్టేషన్‌లు ఖర్చు (కోట్లలో)
బిహెచ్‌ఈఎల్ టు పటాన్‌చెరు టు ఓఆర్‌ఆర్ టు ఇస్నాపూర్ ఎలివేటెడ్ మెట్రో 13 08 రూ.3,250
ఎల్‌బినగర్ టు హయత్‌నగర్ టు పెద్ద అంబర్‌పేట్ ఎలివేటెడ్ మెట్రో 13 08 రూ.3,250
శంషాబాద్ జంక్షన్ మెట్రోస్టేషన్ టు కొత్తూరు టు షాద్‌నగర్ ఎలివేటెడ్ మెట్రో 28 06 రూ.6800
ఉప్పల్ టు ఓఆర్‌ఆర్ టు ఘట్‌కేసర్ టు బీబీనగర్ ఎలివేటెడ్ మెట్రో 25 10 రూ.6900
శంషాబాద్ ఎయిర్‌పోర్టు టు తుక్కుగూడ ఓఆర్‌ఆర్ ఎలివేటెడ్ మెట్రో 26 08 రూ.6600
మహేశ్వరం ఎక్స్‌రోడ్డు, కందుకూరు
తార్నాక టు ఈసిఐఎల్ ఎలివేటెడ్ మెట్రో 08 05 రూ.2300
డబుల్ ఎలివేటెడ్ ప్లైఓవర్ మెట్రో ఫ్రం జేబిఎస్ డబుల్ ఎలివేటెడ్ మెట్రో 17 13 రూ.5690
టు తూంకుంట
డబుల్ ఎలివేటెడ్ ప్లైఓవర్, మెట్రో ఫ్రం ప్యారడైజ్ డబుల్ ఎలివేటెడ్ మెట్రో 12 10 రూ.4.400
మెట్రోరైలు స్టేషన్ కండ్లకోయ
మొత్తం కి.మీలు 142 రూ.39,190 కోట్లు

ఓఆర్‌ఆర్ మెట్రో కారిడార్స్ వివరాలు ఇలా…

మెట్రో కారిడార్స్ ప్రపోజల్స్ కి.మీలు స్టేషన్‌లు ఖర్చు (కోట్లలో)
ఓఆర్‌ఆర్ శంషాబాద్ జంక్షన్ (ఎన్‌హెచ్ 44) ఎలివేటెడ్/అట్‌గ్రేడ్ 40 05 రూ.5600
తూంకుంట జంక్షన్, బొంగుళూరు జంక్షన్,
పెద్ద అంబర్‌పేట్ జంక్షన్ (ఎన్‌హెచ్ 65).
ఓఆర్‌ఆర్ పెద్ద అంబర్‌పేట్ జంక్షన్ (ఎన్‌హెచ్ 65), ఎలివేటెడ్/అట్‌గ్రేడ్ 45 05 రూ.6750
ఘట్‌కేసర్ జంక్షన్, శామీర్‌పేట్ జంక్షన్,
మేడ్చల్ జంక్షన్ (ఎన్‌హెచ్ 44)
ఓఆర్‌ఆర్ మేడ్చల్ జంక్షన్ (ఎన్‌హెచ్ 44), ఎలివేటెడ్/అట్‌గ్రేడ్ 29 03 రూ.4785
దుండిగల్ జంక్షన్, పటాన్‌చెరు జంక్షన్ (ఎన్‌హెచ్65)
ఓఆర్‌ఆర్ పటాన్‌చెరు జంక్షన్ (ఎన్‌హెచ్65), ఎలివేటెడ్/అట్‌గ్రేడ్ 22 03 రూ.3675
కోకాపేట్ జంక్షన్, నార్సింగి జంక్షన్
బిహెచ్‌ఈఎల్, లక్డీకాపూల్ 26
నాగోల్ 05
ఓల్డ్‌సిటీ 5.5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News