Sunday, May 5, 2024

మెట్టూరు డ్యామ్‌లో 92 అడుగులకు చేరిన నీటి మట్టం

- Advertisement -
- Advertisement -

Mettur Dam water

 

చెన్నయ్: కావేరి నీటి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వాన కారణంగా సేలం జిల్లా మెట్టూరు డ్యామ్‌లో నీటిమట్టం 92.44 అడుగులకు పెరిగిందని మంగళవారం పబ్లిక్‌వర్క్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. డెల్టా జిల్లాల ప్రజలకు త్రాగు నీరు, పంట పొలాలకు సాగు నీరు అందించే మెట్టూరు డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. సాగు కోసం సెకనుక 100 క్యూబిక్ ఫీట్ నీటిని విడుదల చేస్తున్నారు. సేలం జిల్లా సహా డెల్టా జిల్లాల్లో కురుస్తున్న వానల కారణంగా మెట్టూరు డ్యామ్ నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News