Sunday, April 28, 2024

ది లెజెండ్ వర్సెస్ లైగర్

- Advertisement -
- Advertisement -

Mike Tyson is set to appear on Indian screen with Liger film

 

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైగర్’ చిత్రంతో లెజెండ్ మైక్‌టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ ప్రస్తుతం అమెరికాకు వెళ్ళింది. మంగళవారం అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగ్ అప్‌డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌లు నవ్వుతూ కనిపించారు.

కానీ ఒక్కసారి డైరెక్టర్ యాక్షన్ అని చెబితే మాత్రం సీన్ మారిపోతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్ అంచనాలు మించేలా ఉంటాయి. ఒకరికొకరు వారు ఎదురుపడితే అగ్గి రాజుకున్నట్టే.. ది లెజెండ్ వర్సెస్ లైగర్ ఫైటింగ్ సీక్వెన్స్ మొదలు అని చిత్రయూనిట్ తెలిపింది. “మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మెమోరీస్‌గా గుర్తు పెట్టుకుంటున్నాను. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే” అని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News