Wednesday, May 1, 2024

టిఎంసికి షాక్… ఎంపీ పదవికి మిమీ చక్రవర్తి రాజీనామా

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నటి, టిఎంసీ నేత మిమి చక్రవర్తి తన లోక్‌సభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజకీయాలు నా కప్పు టీకాదు అని వ్యాఖ్యానించారు. జాదవ్‌పూర్ నుంచి మొదటిసారి ఎంపీ అయిన మిమీ చక్రవర్తి గురువారం మధ్యాహ్నం రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు.

“ఈరోజు నేను మా పార్టీ సుప్రీంను కలుసుకున్నాను. ఈనెల 13నే నా రాజీనామాను ఆమెకు సమర్పించాను. ఇన్ని సంవత్సరాలు నాకు అర్థమైనదేమంటే రాజకీయాలు నా కప్పు టీకాదు” అని విలేఖరులకు ఆమె చెప్పారు. నిబంధనల ప్రకారం స్పీకర్‌కు ఇవ్వకుండా ముఖ్యమంత్రికి ఎందుకు సమర్పించారు ? అని ప్రశ్నించగా, టిఎంసి నుంచి ఒకసారి అంగీకారం లభిస్తే , స్పీకర్‌కు రాజీనామా సమర్పిస్తాను ” అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News